News March 6, 2025

MNCL: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.

Similar News

News March 1, 2026

భద్రాద్రి రాములోరి తలంబ్రాలు.. ఆర్టీసీ ద్వారా మీ ఇంటికే!

image

భద్రాచలం రాములోరి తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కళ్యాణానికి ప్రత్యక్షంగా రాలేని భక్తుల కోసం కార్గో సేవల ద్వారా ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు కోదాడ డిపో మేనేజర్ బి. శ్రీనివాసరావు తెలిపారు. తలంబ్రాలు కావాలనుకునే భక్తులు కోదాడ బస్ స్టేషన్ లోని 9959226302 నంబర్‌ను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

News March 1, 2026

నల్గొండ: ఉచిత బ్యూటీషియన్ కోర్సు.. దరఖాస్తుల ఆహ్వానం

image

నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. మార్చి 4వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ కోర్సుకు 8వ తరగతి ఉత్తీర్ణత సాధించి, 18 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు అర్హులు. ఆసక్తి గలవారు తమ విద్యా అర్హత పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో నేరుగా ప్రాంగణంలో సంప్రదించాలని మేనేజర్ అనిత తెలిపారు.

News March 1, 2026

APPLY NOW: HURLలో 40 పోస్టులు

image

హిందుస్థాన్ ఉర్వరిక్& రసాయన్ లిమిటెడ్(HURL)లో 40 పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 2 రోజులే(మార్చి 3) సమయం ఉంది. పోస్టును బట్టి BSc(అగ్రి), MSc, BTech, MBA/PGDBM, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంజినీర్‌‌ పే స్కేల్ రూ.40,000 -రూ.1,40,000, Asst. మేనేజర్‌కు రూ.50,000-రూ.1,60,000, Jr. Engg. Asst.కు రూ.25,000-రూ.86,400 ఉంది. సైట్: hurl.net.in/