News March 9, 2025
MNCL: MLC రేసులో రేఖానాయక్?

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేఖానాయక్ MLA కోటా MLC రేసులో ముందు వరుసలో ఉన్నారు. 2024 ఎన్నికల ముందు బీఆర్ఎస్‌లో ఉన్న ఆమె ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవటంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ ఆమెకు అవకాశం దక్కలేదు. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై అదిష్ఠానంతో చర్చించనున్నారు. ఎస్టీ కేటగిరీ నుంచి రేఖానాయక్‌కు అవకాశం దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే
Similar News
News March 15, 2026
నిజామాబాద్: బీజేఎల్పీ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన బీజేఎల్పీ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర అధ్యక్షుడు వారికి దిశా నిర్దేశం చేశారు.
News March 15, 2026
రేపు నెల్లూరు జైలు వద్దకు వెళ్లనున్న MP మిథున్ రెడ్డి

నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారం వద్దకు MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం వెళ్లనున్నారు. జైల్లో ఉన్న మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణ రెడ్డితో వారు మూలాఖత్ కానున్నారు. వీరితో పాటు స్థానిక వైసీపీ నేతలు జైలు వద్దకు చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
News March 15, 2026
రేపటి ప్రజావాణి రద్దు: నిర్మల్ కలెక్టర్

నిర్మల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. భారత జనాభా గణన–2025 నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు జనాభా గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాలోని తహశీల్దారులు, ఎంపీడీవోల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్న కారణంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు.


