News March 9, 2025

MNCL: MLC రేసులో రేఖానాయక్?

image

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేఖానాయక్ MLA కోటా MLC రేసులో ముందు వరుసలో ఉన్నారు. 2024 ఎన్నికల ముందు బీఆర్ఎస్‌లో ఉన్న ఆమె ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవటంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ ఆమెకు అవకాశం దక్కలేదు. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై అదిష్ఠానంతో చర్చించనున్నారు. ఎస్టీ కేటగిరీ నుంచి రేఖానాయక్‌కు అవకాశం దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే

Similar News

News October 19, 2025

రాష్ట్రానికి ప్రధాన రథచక్రాలు ఉద్యోగులే: CM

image

AP: ఉద్యోగులకు దీపావళి వేళ శుభవార్త చెప్పాలనే ఉద్దేశంతోనే వారితో సమావేశమైనట్లు CM చంద్రబాబు తెలిపారు. ‘ఉద్యోగులు సంతోషంగా ఉండి అంతా కలిసి పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రానికి ప్రధాన రథచక్రాలు ఉద్యోగులే. పాలసీలు మేం తీసుకువచ్చినా వాటిని అమలు చేసే బాధ్యత వారిదే. ఉద్యోగులు, NDA కార్యకర్తలు ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుంది’ అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

News October 19, 2025

కరీంనగర్: 72 గంటల్లోపే నగదు, బోనస్

image

ధాన్యం విక్రయించిన 72 గంటల్లోపే రైతుల ఖాతాల్లో ధాన్యం ఖరీదుతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు వ్యవసాయ శాఖ అధికారులను సమాయత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించింది.రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే క్వాంటిటీ, గ్రేడ్, అకౌంట్ నంబర్లను వ్యవసాయ శాఖ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించింది.ఉమ్మడి జిల్లాలో 1,32,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని అధికారుల అంచనా.

News October 19, 2025

కల్తీ/అసలైన వెండిని ఇలా గుర్తించండి!

image

*వెండిపై ఉండే హాల్ మార్క్‌ను టెస్టు చేయాలి. 925 ఉంటే వెండిలో 92.5% ప్యూర్ సిల్వర్, 7.5% రాగి ఉన్నట్టు లెక్క. 999 ఉంటే 99.9% ప్యూర్ అని అర్థం.
*వెండి దగ్గర అయస్కాంతం పెడితే అతుక్కోదు. నకిలీ వెండి అతుక్కుంటుంది.
*వెండికి అధిక ఉష్ణ వాహకత (Thermal conductivity)ఉంటుంది. వెండిపై మంచు ముక్క పెడితే త్వరగా కరిగిపోతుంది.
*వెండిని మరో వెండి ముక్కతో కొడితే క్లియర్ సౌండ్ వస్తుంది.