News February 26, 2025

MNCL: అప్పుల బాధతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

మంచిర్యాలలోని రాజీవ్‌నగర్‌లో రామటెంకి బాణేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని SI ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బాణేశ్‌కు 2022లో గుండెకు స్టంట్స్ వేశారు. రెండో భార్య పుష్ప వివాహేతర సంబంధం విషయంలో గొడవలు కావడంతో వెంకటేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదై జైలుకు వెళ్లొచ్చారు. ఈ క్రమంలో అప్పులుకావడంతో భార్య పనికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉరేసుకున్నారు.

Similar News

News December 15, 2025

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం: కలెక్టర్ అనుదీప్

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో సైబర్ క్రైమ్ అవగాహన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేసే మాయమాటలు నమ్మవద్దని, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోకూడదన్నారు. అపరిచిత లింకులు తెరవవద్దని, మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News December 15, 2025

దేశంలోనే తొలిసారి.. భోగాపురంలో

image

దేశంలోనే మొదటి ఏవియేషన్-ఏరోస్పేస్-డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ సమీపంలో GMR మాన్సాస్ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఎడ్యుసిటీని మంత్రులు లోకేశ్, రామ్మోహన్ ఈనెల 16న విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో ప్రారంభిస్తారు. విమానయాన, రక్షణ రంగాల్లో పెరుగుతున్న అవకాశాలకు అనుగుణంగా యువతకు శిక్షణ, ఉద్యోగావకాశాలు కల్పించడం ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఉద్దేశం.

News December 15, 2025

ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు: ASF SP

image

మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP నితికా పంత్ తెలిపారు. ఈ నెల 17న జరిగే ఎన్నికలకు 795 మంది పోలీస్, ఇతర శాఖల సిబ్బందిని నియమించామన్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు 163 BNSS అమల్లో ఉంటుందని, పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో గుంపులు, ర్యాలీలు నిషేధమన్నారు.