News April 26, 2024

MNCL: ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి: కలెక్టర్

image

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి మే 13న జరిగే ఎన్నికల్లో అర్హత గల ప్రతి ఒక్కరు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం మంచిర్యాల కలెక్టరేట్‌లో ఓటరు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. దేశాభివృద్ధికి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఓటు హక్కు ద్వారా మాత్రమే ఉంటుందని తెలిపారు.

Similar News

News January 9, 2025

విజనరీ లీడర్‌‌గా బాసర ఆర్జీయూకేటీ వీసీ

image

ప్రతిష్ఠాత్మక బిజినెస్ టాక్జ్ మ్యాగజైన్‌లో వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ అలిసేరి స్థానం పొందారు. బిజినెస్ టాక్జ్ మ్యాగజైన్ తన తాజా ఎడిషన్‌‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత నాయకత్వాన్ని పునర్ నిర్వచించే ప్రముఖ వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా మార్పు, ఆవిష్కరణలకు అభివృద్ధికి సంబంధిన రంగాలలో గణనీయమైన కృషి చేసిన వ్యక్తులను సత్కరిస్తుంది.

News January 9, 2025

 సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలి: NRML కలెక్టర్

image

సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోలార్ ప్లాంట్ల స్థల సేకరణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని మండలాల్లో అధికారులు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని ఆదేశించారు.

News January 9, 2025

ADB: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి

image

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాల కోసం ప్రభుత్వం ఫిబ్రవరి 23న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనుందన్నారు. https://tgcet.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 01వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.