News March 23, 2025
MNCL: డివిజనల్ స్థాయి కమిటీ సమావేశం

మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో శనివారం భూ సంబంధిత సమస్యల పరిష్కారానికై డివిజనల్ స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆర్డీవో గూడూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏసీపీలు ప్రకాశ్, వెంకటేశ్వర్, డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు పాల్గొన్నారు. ఆర్డీవో మాట్లాడుతూ.. ప్రతి మండలంలో భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులో సమస్యలు ఉన్న వాటిని డివిజన్ కమిటీకి పంపాలని ఆదేశించారు.
Similar News
News December 15, 2025
NLG: రెండో విడతలోనూ ఆ పార్టీదే హవా

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ ఓటర్లు అధికార పార్టీకే పట్టం కట్టారు. మొదటి రెండో విడతలో 597 స్థానాలకు ఎన్నికలు జరగగా అందులో 407 స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఇక బీఆర్ఎస్ మద్దతుదారులు 146 స్థానాలు గెలుపొందారు. సీపీఐ, సీపీఎం, ఇతరులు కలుపుకొని రెండు విడతల్లో 40 మంది గెలుపొందగా.. బీజేపీ 4 స్థానాలకే పరిమితం కావలసి వచ్చింది. రెండో విడతలోను బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు.
News December 15, 2025
VKB: మండలాల వారిగా ఏ పార్టీకి ఎన్ని అంటే?

VKB డివిజన్‌లో రెండో విడత ఎన్నికల ఫలితాలు మండలాల వారిగా పార్టీలకు వచ్చిన స్థానాలు ఇవే. మర్పల్లి కాంగ్రెస్ 22, BRS 7, VKBలో కాంగ్రెస్ 13, BRS 1, BJP 1, INDPT 6, ధారూరు కాంగ్రెస్ 22, BRS 8 BJP 4, INDPT 2, మోమిన్‌పేటలో కాంగ్రెస్ 15, BRS 9 INDP 5, నవాబుపేటలో కాంగ్రెస్ 23 BRS 4, BJP 2, INDPT 3, బంట్వారం కాంగ్రెస్ 4, BRS 4, INDPT 4, కోటపల్లి కాంగ్రెస్ 11, BRS 3, BJP 1 INDPT 3 స్థానాల్లో గెలుపొందారు.
News December 15, 2025
GWL: నేడు ‘ప్రజావాణి’ కార్యక్రమం రద్దు

గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా, ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నేడు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజావాణి తిరిగి యథావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, కార్యాలయానికి వచ్చి అసౌకర్యానికి గురి కావొద్దని కలెక్టర్ సూచించారు.


