News January 31, 2025
MNCL: తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య

మంచిర్యాలలోని కాలేజీ రోడ్‌కు చెందిన చిట్యాల తరుణ్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేసే తరుణ్ పనికి సక్రమంగా వెళ్లకపోవడంతో తల్లి సూరమ్మ మందలించింది. దీంతో మనస్తాపం చెంది బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాహనాల కూలెంట్ తాగాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు ఏఎస్సై వెంకన్న గౌడ్ తెలిపారు.
Similar News
News March 14, 2025
స్టాలిన్ ప్రభుత్వంపై నిర్మల సీతారామన్ ఫైర్

తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో <<15745743>>రూపీ(₹) గుర్తును<<>> తొలగించి రూ. అనే అక్షరాన్ని చేర్చడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైరయ్యారు. 2010లో కేంద్రం రూపీ సింబల్‌ను ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని స్టాలిన్ సర్కారును ప్రశ్నించారు. ఇప్పుడు ఈ గుర్తును తిరస్కరించి తమిళ యువత సృజనాత్మకతను విస్మరించారని మండిపడ్డారు. కాగా రూపీ(₹) గుర్తును డిజైన్ చేసింది డీఎంకే నేత కుమారుడు ఉదయ కుమార్ కావడం గమనార్హం.
News March 14, 2025
వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మల్లయ్య యాదవ్

వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మల్లయ్య యాదవ్ ఎంపికయ్యారు. గుత్తి మండలం బేతపల్లికి చెందిన వైసీపీ నేతలు సూర్యనారాయణ, ఈశ్వరయ్య, తదితరులు మల్లయ్య యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ముందుగా మల్లయ్యను శాలువాతో సత్కరించి, పూలమాల వేసి సన్మానించారు. రైతుల సమస్యల పట్ల పోరాడుతానన్నారు. తనను ఎంపిక చేసినందుకు వైఎస్ జగన్, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
News March 14, 2025
ఎంటెక్ ఫలితాల విడుదల

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఎంటెక్ 1వ, 2వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R21) పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ పీ.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కే.మాధవి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.