News January 1, 2025

MNCL: తీవ్ర విషాదం.. నలుగురు మృతి

image

2024 చివరి రోజు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు యువకులు మృతి చెందారు. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మెుగవెల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో బైక్ అదుపుతప్పి కడెం కెనాల్‌లో పడి ఇద్దరు యువకులు చనిపోయారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Similar News

News January 6, 2025

ADB: మాంజాతో గొంతులు తెగుతున్నాయ్.. జాగ్రత్త.!

image

సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండటంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. కాగా, చైనా మాంజాలు వాడినా, విక్రయించినా చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

News January 6, 2025

సారంగాపూర్‌: డిసెంబర్ 31న గొడవ.. కత్తితో పొడిచారు

image

ఓ యువకుడిపై హత్యాయత్నం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. CI రామకృష్ణ వివరాలు.. సారంగాపూర్ మండలం బోరేగాం గ్రామానికి చెందిన షేక్ అర్షద్, సాయికుమార్, మరో బాలుడు డిసెంబర్ 31న గొడవపడ్డారు. అది మనసులో పెట్టుకున్న సాయికుమార్ సదరు బాలుడితో కలిసి ఈనెల 4న అర్షద్‌ను గ్రామంలోని ఓ కూడలి వద్దకు రప్పించి కత్తితో పొడిచి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు.

News January 6, 2025

ఉమ్మడి ADBపై చలి పంజా

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. ఆదివారం ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా అర్లి(T)లో 5.9, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్(U) 6.0, నిర్మల్ జిల్లాలో పెంబి 8.0, మంచిర్యాల జిల్లాలో నెన్నెల 9.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గాయి.