News April 25, 2025

MNCL: నేడు సైన్స్ సమ్మర్ క్యాంపు ప్రారంభం

image

మంచిర్యాల పట్టణంలోని జిల్లా సైన్స్ కేంద్రంలో శుక్రవారం సైన్స్ సమ్మర్ క్యాంపును జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించనున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. మే నెల 8వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల సమ్మర్ క్యాంపు జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో విజ్ఞాన తృష్ణ తీర్చేందుకు ఈ క్యాంపు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News April 25, 2025

గద్వాల: యువకుడి ఆత్మహత్య.. కేసు నమోదు

image

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల జిల్లా ఉండవెల్లి PS పరిధిలో జరిగింది. SI మహేశ్ తెలిపిన వివరాలు.. బొంకూరు గ్రామ వాసి K.మధు(34) బయటకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. అనంతరం తనకు తెలిసిన వ్యక్తి రాముడికి ఫోన్ చేసి ‘మా తాతల ఆస్తి నాకు సరిగా పంచలేదు.. అందుకే పొలం వద్ద పురుగు మందు తాగి చనిపోతున్నా’ అని చెప్పాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. కేసు నమోదైంది.

News April 25, 2025

HYD: మూసీ ప్రాజెక్ట్.. భూ పరీక్షలకు బిడ్లు ఆహ్వానం

image

మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూసీ ప్రాజెక్టు అభివృద్ధిపై చక చకా అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే మీర్‌అలం ట్యాంకు వద్ద భూ పరీక్షలు నిర్వహించేందుకు బిడ్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. మూసీకి ఆనుకుని ఉన్న భూమి పరిస్థితి, భూబలం, ఇతర సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఈ పరీక్షలు తోడ్పడనున్నాయి.

News April 25, 2025

గద్వాల: యువకుడి ఆత్మహత్య.. కేసు నమోదు

image

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల జిల్లా ఉండవెల్లి PS పరిధిలో జరిగింది. SI మహేశ్ తెలిపిన వివరాలు.. బొంకూరు గ్రామ వాసి K.మధు(34) బయటకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. అనంతరం తనకు తెలిసిన వ్యక్తి రాముడికి ఫోన్ చేసి ‘మా తాతల ఆస్తి నాకు సరిగా పంచలేదు.. అందుకే పొలం వద్ద పురుగు మందు తాగి చనిపోతున్నా’ అని చెప్పాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. కేసు నమోదైంది.

error: Content is protected !!