News February 13, 2025
MNCL: ప్రేమ పేరుతో మోసం.. అట్రాసిటీ కేసు నమోదు

మంచిర్యాలలో ప్రేమ పేరుతో ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు. పట్టణానికి చెందిన తాటికొండ రాంచందర్ ఓ మహిళను 4ఏళ్లుగా ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు బుధవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాంచందర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News December 14, 2025
362 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 362 మల్టీ టాస్కింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్( టైర్ 1, టైర్ 2) ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.18,000-రూ.56,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: mha.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 14, 2025
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<
News December 14, 2025
యుద్ధరంగంలో మెదక్ ఫ్యాక్టరీ సత్తా..!

భారత సైన్యం వినియోగించే అత్యాధునిక (BMP-II) యుద్ధ వాహనాలకు సంబంధించి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (OFM)వార్షిక ఉభయచర పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. సంగారెడ్డిలోని యెడమైలారం కేంద్రంలో తయారైన ఈకంబాట్ వాహనాల ట్రయల్స్‌ను మల్కాపూర్ చెరువులో నిర్వహించారు. ఈBMP-II,దాని ఇతర స్పెషలైజ్డ్ వేరియంట్లు నీటిలో,భూమిపై తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయి.ఈ విజయం దేశీయ రక్షణ ఉత్పత్తుల నాణ్యతను మరోసారి చాటింది.


