News May 10, 2024
MNCL: రైలు కింద పడి సింగరేణి కార్మికుడి ఆత్మహత్య
మంచిర్యాలలోని హమాలివాడకు చెందిన ఊరుగొండ సాయికుమార్ అనే సింగరేణి కార్మికుడు గురువారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నెల 20న ఉద్యోగంలో చేరిన సాయికుమార్ గనిలో దిగాలంటే భయంగా ఉందని, ఉద్యోగం చేయలేనంటూనే వాడు. ఈ క్రమంలో గురువారం డ్యూటీకి వెళ్లిన సాయికుమార్ రైలు పట్టాలపై శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
Similar News
News January 20, 2025
బాసర: ఫిబ్రవరిలో వసంత పంచమి వేడుకలు
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ అర్చక వైదిక బృందం,అధికారులు ఫిబ్రవరి 01.02.2025 నుండి 03.02.2025 వరకు అమ్మవారికి విశేష పూజలు చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. అమ్మవారి సన్నిధిలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించనున్నారు.
News January 20, 2025
నిర్మల్ కవులకు జాతీయ పురస్కారాలు
నిర్మల్ జిల్లాకు చెందిన కవులు జాతీయ పురస్కారాలను ఆదివారం అందుకున్నారు. కరీంనగర్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా గౌతమేశ్వర సాహితి కళాసేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రదానంలో అంబటి నారాయణ సాహితీ రత్న, నేరెళ్ల హనుమంతుకు సాహితి కిరణం పురస్కారాలను అందుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరు నిరంతరాయంగా కవిత్వాలను రాయడంతో అవార్డుకు ఎంపిక చేశామని వ్యవస్థాపకులు గౌతమేశ్వర తెలిపారు.
News January 20, 2025
నిర్మల్: పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ట్యూషన్ ఫీజు చెల్లింపు గడువు పొడిగించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్, కో ఆర్డినేటర్ గంగాధర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. డిగ్రీ సెకండ్, థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీజు గడువు జనవరి 25 వరకు చెల్లించవచ్చన్నారు. డిగ్రీ 1,3,5 సెమిస్టర్ ఫీజు గడువు జనవరి 30 వరకు పొడిగించినట్లు చెప్పారు..