News April 7, 2025
MNCL:GOOD NEWS.. 7 నుంచి కంటి పరీక్షలు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్ల లోపుచిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లావైద్యారోగ్యశాఖ అధికారి డా.హరీశ్ రాజ్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 8 ఆర్బీఎస్కే బృందాలతో 37, 920 మంది పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News January 3, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరులో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు:
* బంగారం 24 క్యారెట్ల 10 గ్రాము ధర: రూ.1,38,350
* బంగారం 22 క్యారెట్ల 10 గ్రాము ధర: రూ.1,27,280
* వెండి 10 గ్రాముల ధర: రూ.2,380.
News January 3, 2026
కేసీఆర్ వదిలిన రాజకీయ బాణం కవిత: కోమటిరెడ్డి

మాజీ సీఎం కేసీఆర్ వదిలిన రాజకీయ బాణంగా కవిత వ్యవహరిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న నేతలను దూరం చేసేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. కవిత అసలు బీఆర్ఎస్లో ఉన్నారో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌పై విమర్శలకే స్పందిస్తున్న ఆమె.. హరీశ్‌రావుపై వస్తున్న ఆరోపణల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని మంత్రి ప్రశ్నించారు.
News January 3, 2026
ఆలివ్ ఆయిల్‌తో ఎన్నో లాభాలు

వంటల్లో ఆలివ్ ఆయిల్ చేర్చడం వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు. ఆలివ్స్‌లో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. గుండెకు మేలుచేసే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యంతో పాటు కొన్నిరకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సాయపడుతాయని పలు సర్వేలు తేల్చాయి. జీర్ణ వ్యవస్థతోపాటు చర్మ ఆరోగ్యాన్నీ కాపాడుతాయి.


