News April 7, 2025
MNCL:GOOD NEWS.. 7 నుంచి కంటి పరీక్షలు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్ల లోపుచిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లావైద్యారోగ్యశాఖ అధికారి డా.హరీశ్ రాజ్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 8 ఆర్బీఎస్కే బృందాలతో 37, 920 మంది పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News April 9, 2025
పెరిగిన బంగారం ధరలు

గత ఐదు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ₹710 పెరిగి ₹90,440కు, 22 క్యారెట్ల గోల్డ్ ₹650 పెరిగి ₹82,900కు చేరాయి. అటు వెండి ధర మాత్రం రూ.1000 తగ్గి కేజీ రూ.1,02,000 పలుకుతోంది.
News April 9, 2025
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 13.4 మి.మీ వర్షం

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 8 గంటల వరకు 13.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారిగా మహదేవ్‌పూర్ 4.2, పలిమెల 0, ముత్తారం 4.2, కాటారం 2.6, మల్హర్ రావు 0, చిట్యాల 0, టేకుమట్ల 0, మొగుళ్లపల్లి 0, రేగొండ 0, ఘన్‌పూర్ 1.2, కొత్తపల్లి గోరి 0, భూపాలపల్లి 1.2 మి.మీ వర్షం నమోదైంది.
News April 9, 2025
బ్రంకోస్కోపి టెస్ట్ ఏంటి? ఎలా చేస్తారు?

ఊపిరితిత్తుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ నిర్వహిస్తారు. కెమెరాతో కూడిన పరికరాన్ని ముక్కు/నోటి ద్వారా పంపుతారు. కణితులు, శ్వాసనాళ క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు, బ్లాక్స్, ఇన్ఫెక్షన్ వంటివి నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం చేయడానికి 30-45 నిమిషాలు పడుతుంది. సింగపూర్ అగ్నిప్రమాదంలో గాయపడ్డ AP Dy.CM కుమారుడు మార్క్ శంకర్‌కు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో నిన్న ఈ <<16034506>>టెస్ట్ <<>>చేశారు.