News April 7, 2025
MNCL:GOOD NEWS.. 7 నుంచి కంటి పరీక్షలు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్ల లోపుచిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లావైద్యారోగ్యశాఖ అధికారి డా.హరీశ్ రాజ్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 8 ఆర్బీఎస్కే బృందాలతో 37, 920 మంది పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News April 9, 2025
YS జగన్‌పై కేంద్రానికి టీడీపీ ఎంపీ ఫిర్యాదు

AP: మాజీ సీఎం జగన్ తీరు ప్రజాస్వామ్యానికి హానికరంగా మారిందని TDP MP లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ‘జగన్ ప్రసంగాలు శాంతి భద్రతలకు ముప్పు కలిగించేలా ఉన్నాయి. పర్యటనల పేరిట విధ్వంసాలు సృష్టించాలని చూస్తున్నారు. పోలీసుల నైతికతను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. బెయిల్‌పై ఉన్న ఆయన వ్యవస్థలను బెదిరించేలా వ్యవహరించడం బెయిల్ షరతులను ఉల్లంఘించడమే’ అని లేఖలో పేర్కొన్నారు.
News April 9, 2025
కృష్ణా: రెవెన్యూ సర్వీసుల దరఖాస్తు ఫీజుల వివరాలు

కృష్ణాజిల్లాలో రెవెన్యూ సర్వీసులకు సంబంధించి దరఖాస్తు ఫీజుల వివరాలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ప్రకటించారు.
* పట్టాదార్ పాస్ బుక్, అడంగల్ సవరణకు రూ.150
* భూ సర్వే, ఆన్ పట్టా సబ్ డివిజన్ కోసం రూ.550
* అడంగల్ సవరణ, కుల, ఆదాయ ధృవీకరణ, నివేశన స్థల ధృవీకరణ పత్రానికి రూ.50ను అధికారులు దరఖాస్తు రుసుంగా వసూలు చేస్తారన్నారు.
News April 9, 2025
సంగారెడ్డి: హాబిటేషన్ సమాచారాన్ని సేకరించాలి: డీఈఓ

రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోనీ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు లేని ప్రాంతాలను సీఆర్పీలు క్షేత్ర స్థాయికి వెళ్లి సమాచారాన్ని పక్కగా సేకరించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా సేకరించిన సమాచారాన్ని రేపు మధ్యాహ్నం జిల్లా కార్యాలయానికి పంపించాలని సూచించారు.