News March 5, 2025
MNNR: పరీక్ష కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ అన్నారు. రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎస్పీ విడుదల చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టిందని వెల్లడించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.
Similar News
News October 24, 2025
MBNR: పోలీస్ కార్యాలయంలో రేపు ఓపెన్ హౌస్

మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం పరేడ్ గ్రౌండ్లో ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. పోలీస్ శాఖ పనితీరు, ఆధునిక పోలీసింగ్ విధానాలు, సైబర్ క్రైమ్పై ప్రజల్లో చైతన్యం కల్పించే అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు, పోలీసుల మధ్య పరస్పర అవగాహన, విశ్వాసం పెరుగుతుందని తెలిపారు.
News October 24, 2025
మహబూబ్నగర్: పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు: కలెక్టర్

మహబూబ్నగర్ జిల్లాలో వానాకాలం సీజన్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ సమావేశ మందిరంలో శుక్రవారం ధాన్యం కొనుగోలుపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తూకం, బస్తా, తేమ కొలిచే పరికరాల సదుపాయాలు ఉండేలా చూడాలని సూచించారు.
News October 24, 2025
దేవరకద్రలో వ్యక్తి దారుణ హత్య

దేవరకద్ర మండలం అడవి అజిలాపూర్ గ్రామానికి చెందిన దానం మైబు(40) హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శక్రవారం వెలుగు చూసింది. మైబు హమాలి పని ముగించుకొని గురువారం రాత్రి 9:30 గంటలకు బైక్ పై ఇంటికి వెళ్తుండగా అడవి అజిలాపూర్ గేటు సమీపంలో గుర్తుతెలియని దుండగులు దారుణంగా నరికి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.


