News June 29, 2024
మొబైల్ నంబర్ పోర్టింగ్.. జులై 1 నుంచి కొత్త రూల్

సిమ్ స్వాప్ లేదా మార్పిడి తర్వాత మొబైల్ నంబర్ పోర్టింగ్ సమయాన్ని ట్రాయ్ వారం రోజులకు కుదించింది. ఈ నిబంధన జులై 1 నుంచి అమల్లోకి రానుంది. గతంలో ఇది 10 రోజులుగా ఉండేది. ఇకపై 7 రోజుల్లోగా నంబర్ మార్చుకునేందుకు UPC కేటాయించనుంది. సుదీర్ఘ నిరీక్షణ వల్ల యూజర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని 2-3 రోజులకు తగ్గించాలనే వినతులూ వస్తున్నాయి.
Similar News
News December 4, 2025
ఆరుద్రలో అడ్డెడు చల్లినా పుట్టెడు పంట

ఆరుద్ర కార్తె అనేది వర్షాకాలం ప్రారంభంలో వ్యవసాయ పనులకు సరైన సమయం. ఈ కార్తెలో భూమిలో తగినంత తేమ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అడ్డెడు( తక్కువ పరిమాణంలో) విత్తనాలు చల్లినా, అవి బాగా మొలకెత్తి పుట్టెడు(ఎక్కువ) పంటను ఇస్తాయని రైతుల విశ్వాసం. ఈ సామెత ఆరుద్ర కార్తెలో విత్తనాలు వేయడం, అప్పటి వర్షాలు.. పంటకు ఎంత అనుకూలంగా ఉంటాయో తెలియజేస్తుంది.
News December 4, 2025
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా

భారత్పై రెండో వన్డేలో గెలిచిన సౌతాఫ్రికా ఛేజింగ్లో రికార్డ్ సృష్టించింది. భారత్పై అత్యధిక స్కోర్ ఛేదించిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా సరసన నిలిచింది. 2019 మొహాలీలో భారత్ 359 రన్స్ చేయగా ఆసీస్ ఛేజ్ చేసింది. నిన్న రాయ్పూర్లోనూ సౌతాఫ్రికా ఇదే స్కోరును ఛేదించింది. అలాగే మూడుసార్లు(2సార్లు AUS, IND) 350, అంతకంటే ఎక్కువ పరుగులను ఛేజ్ చేసిన జట్టుగా భారత్ సరసన నిలిచింది.
News December 4, 2025
చంద్రుడికి అర్ఘ్యం ఎలా సమర్పించాలి?

అర్ఘ్యం ఇవ్వడానికి ముందుగా రాగి పాత్ర తీసుకోవాలి. అందులో శుభ్రమైన నీరు, కొద్దిగా పాలు పోయాలి. అక్షతలు, పూలు వేయాలి. దాన్ని 2 చేతులతో పట్టుకుని, చంద్రుడిని చూస్తూ నిలబడాలి. చంద్రుడి మంత్రాలు చదువుతూ.. ఆ నీటిని కిందకు ప్రవహించేలా నెమ్మదిగా పోయాలి. ఇలా చేయడం చంద్రుడి అనుగ్రహంతో ఆరోగ్యం, అదృష్టం మెరుగుపడతాయని ప్రగాఢ విశ్వాసం. అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుందని, మనస్సు స్థిరంగా ఉంటుందని నమ్మకం.


