News April 21, 2024
చేతిలో పేలిన సెల్‌ఫోన్.. బాలికకు తీవ్ర గాయాలు

AP: సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తుండగా పేలడంతో 11 ఏళ్ల బాలిక వీరలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పల్నాడు(D) ఎమ్మాజీగూడెంలో జరిగింది. ప్రమాదంలో బాలిక కుడి చేతి 2 వేళ్లు పూర్తిగా తెగిపోయాయి. పొట్ట భాగంలోనూ గాయాలయ్యాయి. తల్లిదండ్రులు వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
NOTE: ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి మాట్లాడటం, వీడియోలు చూడటం ప్రమాదకరం. ఒక్కోసారి ప్రాణాలే పోవచ్చు.
Similar News
News April 1, 2026
నేటి నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం

ఈరోజు నుంచి కొత్త ఐటీ చట్టం అమలులోకి వస్తుంది. దీంతో HYDలో ఉద్యోగులకు ప్రస్తుతం మూలవేతనంలో 40%గా ఉన్న HRA 50%కు పెరగనుంది. ఇకపై HRA క్లెయిమ్ చేసేటప్పుడు యజమాని వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. వార్షిక వడ్డీ ఆదాయం ₹50వేలు మించితే TDS వర్తించనుంది. పిల్లల హాస్టల్ బిల్లు మినహాయింపు ₹300 నుంచి ₹9వేలకు పెరగనుంది. ఉద్యోగులకు ఇచ్చే వార్షిక బహుమతుల పన్ను మినహాయింపు పరిమితి ₹5వేల నుంచి ₹15వేలకు పెరగనుంది.
News April 1, 2026
జలవివాదాల్లో జోక్యం చేసుకోలేం: కృష్ణా బోర్డు

తెలుగు రాష్ట్రాల జలవివాదాల్లో జోక్యం చేసుకోలేమని కృష్ణా నది యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. నీటి పంపిణీపై ప్రస్తుతం జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్‌లో విచారణ జరుగుతోందని.. ఇప్పుడు జోక్యం చేసుకుంటే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపింది. శ్రీశైలం-నాగార్జున సాగర్‌లోని కృష్ణా జలాల వాడకం, విద్యుత్ ఉత్పత్తిపై ఏపీని నిలువరించాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై ఈ మేరకు స్పందించింది.
News April 1, 2026
లక్నో ఈసారి రాణిస్తుందా?

IPL: సొంతగడ్డపై లక్నో సూపర్ జెయింట్స్ ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. గత రెండు సీజన్లలో పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానానికి పరిమితమైన LSG ఈసారి సమష్టి ప్రదర్శనతో రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు అక్షర్ పటేల్ నేతృత్వంలోని DC మీదా అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడంతో బోణీ ఎవరు కొడతారనేది ఆసక్తికరంగా మారింది. రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.


