News July 27, 2024

మొబైల్ రీఛార్జ్.. కస్టమర్లకు గుడ్ న్యూస్!

image

వాయిస్ కాల్స్, డేటా, SMSలకు విడివిడిగా రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని ట్రాయ్ భావిస్తోంది. వచ్చే నెల 16లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని వినియోగదారులను కోరింది. ప్రస్తుతం వాయిస్, డేటా, SMSలను బండిల్డ్ ప్లాన్ రూపంలో ఇస్తున్నాయి. దీంతో చాలా మంది వాయిస్ కాల్స్, SMSలు మాత్రమే వినియోగించుకుని డేటా వాడట్లేదు. ఇంటర్నెట్ వాడకపోయినా తాము డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఫిర్యాదులు చేస్తున్నారు.

Similar News

News February 2, 2026

నిజమైన కరుంగలి మాలను ఎలా గుర్తు పట్టాలి?

image

మార్కెట్లో నకిలీ మాలలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నిజమైన కరుంగలి పూసలు బరువుగా ఉంటాయి. నీటిలో వేస్తే వెంటనే మునిగిపోతాయి. నకిలీవి తేలుతాయి. నిజమైన పూసలు సహజమైన నలుపు రంగులో ఉంటాయి. తాకితే నునుపుగా, చల్లగా అనిపిస్తాయి. వీటిపై ఎటువంటి రంగు పూత ఉండదు. ఓ పూసను నీటిలో నానబెట్టినప్పుడు నీరు రంగు మారకూడదు. అసలైన కలప కాంతిని సహజంగా ప్రతిబింబించాలి.

News February 2, 2026

అత్తింటి వేధింపులు.. ముగ్గురు పసిపిల్లల్ని చంపి..

image

కర్ణాటకలోని బగల్‌కోట్‌లో ముగ్గురు పసిపిల్లలను ఉరేసి చంపిన ఓ తల్లి డీజిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం ఇంటిలోపలి వైపు తాళం వేసి ఉండగా స్థానికుల సాయంతో భర్త డోర్ ఓపెన్ చేశారు. పిల్లలు అప్పటికే చనిపోగా చావుబతుకుల్లో ఉన్న భార్య(రూప)ను ఆసుపత్రికి తరలించారు. అత్తింటి వేధింపులే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

News February 2, 2026

805 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(C-DAC)805 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో హైదరాబాద్‌లో 105 పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీజీ(సైన్స్, MCA, PhD అర్హత గల అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ /స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdac.in