News November 21, 2024
గ్రూప్-2 అభ్యర్థులకు నమూనా పరీక్షలు
TG: మైనారిటీ అభ్యర్థుల కోసం డిసెంబర్లో గ్రూప్-2 నమూనా పరీక్షలు నిర్వహించనున్నట్లు మైనారిటీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ తెలిపారు. అన్ని జిల్లాల్లో మైనారిటీ సంక్షేమ అధికారుల పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. DEC 2, 3 తేదీల్లో తొలి నమూనా పరీక్ష, DEC 9, 10 తేదీల్లో రెండో నమూనా పరీక్ష ఉంటుందని చెప్పారు. ఈనెల 29లోగా అప్లై చేసుకోవాలని, వివరాలకు 040-23236112 నంబర్లో సంప్రదించాలన్నారు.
Similar News
News November 21, 2024
గంజాయి పండించినా, తరలించినా పీడీ యాక్ట్: హోంమంత్రి
AP: గంజాయి సాగు చేసినా, తరలించినా పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయిపై సభ్యుల ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ‘5 నెలల్లో 25వేల KGల గంజాయి పట్టుకున్నాం. ఐదేళ్లలో జగన్ గంజాయిపై సమీక్ష చేయలేదు. గతంలో బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లు రెచ్చిపోయాయి. యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్‌తో నేరస్థులను అణచివేస్తాం’ అని ఆమె స్పష్టం చేశారు.
News November 21, 2024
‘పుష్ప-2’ ట్రైలర్‌పై శిల్పా రవి ప్రశంసలు.. బన్నీ రిప్లై
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ ట్రైలర్‌పై సినీ వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్‌లో జరిగిన ట్రైలర్ ఈవెంట్ సైతం సినీ ఇండస్ట్రీని షేక్ చేసిందని కొనియాడుతున్నారు. తాజాగా హీరోను, మేకర్స్‌ను అభినందిస్తూ బన్నీ స్నేహితుడు, వైసీపీ నేత శిల్పా రవి ట్వీట్ చేశారు. దీనికి బన్నీ స్పందిస్తూ.. ‘నీ ప్రేమకు ధన్యవాదాలు బ్రదర్’ అని రిప్లై ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్ వైరలవుతోంది.
News November 21, 2024
పిల్లలు పిట్టల్లా రాలుతుంటే.. CM పిట్టలదొర మాటలు: KTR
TG: ఎన్నడూ లేనిది గురుకుల పాఠశాలల్లో 40 మందికి పైగా విద్యార్థులు మరణించారని KTR ట్వీట్ చేశారు. ‘పిల్లలు పిట్టల్లా రాలుతుంటే దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా CM రేవంత్ వేదికల మీద పిట్టలదొర మాటలు చెబుతుండు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించలేని రేవంత్ మహిళలను కోటీశ్వరులను చేస్తాడట’ అని సెటైర్లు వేశారు. ‘దవాఖానల్లో విద్యార్థులు, చెరసాలలో రైతన్నలు, ఆందోళనలో నిరుద్యోగులు’ అని పేర్కొన్నారు.