News September 22, 2025
అన్ని నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు: మంత్రి లోకేశ్

AP: అమరావతిలో రూ.150కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో లైబ్రరీ నిర్మాణాన్ని చేపడుతున్నామని, 24నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘కొత్త జిల్లాల ప్రాతిపదికన 26 జిల్లా గ్రంథాలయాలు, 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు తెస్తాం. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన అన్ని పుస్తకాలను అందుబాటులోకి తెస్తాం. మోడల్ లైబ్రరీలకు సంబంధించిన యాప్‌ను 100 రోజుల్లో ఆవిష్కరిస్తాం’ అని అసెంబ్లీలో అన్నారు.
Similar News
News September 22, 2025
‘విజయవాడ ఉత్సవ్’కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

AP: నేటి నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న విజయవాడ <<17789445>>ఉత్సవ్‌కు<<>> సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దుర్గ గుడి భూముల్లో వాణిజ్య కార్యకలాపాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన కోర్టు పిటిషనర్ అభ్యంతరాలను తోసిపుచ్చింది. లీజ్‌కు తీసుకున్న వారికి, ఆలయానికి సమస్య లేనప్పుడు మూడో వ్యక్తికి అభ్యంతరమేంటని అసహనం వ్యక్తం చేసింది. పిటిషన్‌ను కొట్టేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.
News September 22, 2025
మహిళా సైంటిస్టులకు ఓ పథకం

ప్రతిభావంతులైన మహిళా శాస్త్రవేత్తల కోసం కేంద్ర ప్రభుత్వం ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (WISE-KIRAN) పథకం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మూడేళ్లపాటు నెలకు రూ.50 వేల గౌరవవేతనం, HRA సదుపాయాలు కల్పించి, వారి ప్రాజెక్టు కోసం రూ.30 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తుంది. పీజీ పూర్తిచేసి, 27-60 ఏళ్లున్న మహిళలు అర్హులు. రెగ్యులర్ ఉద్యోగం చేస్తున్న మహిళలకు ఈ పథకం వర్తించదు.
News September 22, 2025
ఎయిరిండియా విమాన ప్రమాదం.. కేంద్రానికి SC నోటీసులు

అహ్మదాబాద్ Air India విమాన ప్రమాదంపై AAIB ప్రాథమిక నివేదికపై SC కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు పూర్తికాక ముందే పైలట్ ఇంధన కంట్రోల్ స్విచ్‌లు ఆఫ్ చేశారేమో అన్నట్లు ఊహాగానాలు వ్యాప్తి చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. పైలట్ల పనితీరులో లోపాలున్నట్లు చెప్పడం బాధ్యతా రాహిత్యమేనని పేర్కొంది. ఈ ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.