News February 25, 2025
మోడల్ స్కూల్ దరఖాస్తుల గడువు పెంపు

TG: మోడల్ స్కూళ్ల దరఖాస్తు గడువును మార్చి10వ వరకు పెంచినట్లు విద్యాశాఖ తెలిపింది. ఈనెల 28వ తేదీతో గడువు ముగుస్తుండగా మార్చి10 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం GO జారీ చేసింది. మోడల్ స్కూళ్లలో 6 నుంచి 10తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఫీజు ఓసీలు రూ.200, ఇతర వర్గాల వారు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. సైట్: https://telanganams.cgg.gov.in/
Similar News
News November 19, 2025
రెండేళ్లుగా కూతురిని ఇంట్లోనే బంధించిన తల్లి.. ఎందుకంటే?

AP: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన బాలిక 9వ తరగతి వరకు చదువుకుంది. రజస్వల అయిన తర్వాత “బయట ప్రపంచం ప్రమాదం” అనే భయంతో రెండేళ్ల పాటు తల్లి భాగ్యలక్ష్మి ఆమెను ఇంటికే పరిమితం చేసింది. భర్త మృతితో ఒంటరిగా మారిన తల్లి తన భయాలను కుమార్తెకు రుద్దింది. అధికారులు జోక్యం చేసుకొని తల్లీకుమార్తెలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని KGHకు, మౌనికను సంరక్షణ కేంద్రానికి తరలించారు.
News November 19, 2025
రాజమౌళి-మహేశ్‌బాబు ‘వారణాసి’పై వివాదం!

రాజమౌళి-మహేశ్‌బాబు ‘వారణాసి’ సినిమాపై వివాదం మొదలైంది. సుబ్బారెడ్డి అనే డైరెక్టర్ ఇదే టైటిల్‌ను రెండేళ్ల క్రితం TFPCలో రిజిస్టర్ చేయించారు. ఆ టైటిల్‌ను SSMB29 టీమ్ ఉపయోగించడంతో ఆయన TFPCలో ఫిర్యాదు చేశారు. అయితే రాజమౌళి తెలుగు మినహా ఇతర భాషల్లో ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే గ్లింప్స్‌లోనూ మూవీ టైటిల్‌ను తెలుగులో ఇవ్వలేదని సమాచారం. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.
News November 19, 2025
ఐబొమ్మతో పైరసీ ఆగిపోతుందా?.. సీవీ ఆనంద్ రిప్లై ఇదే!

TG: కొందరిని అరెస్టు చేయగానే సైబర్ క్రైమ్స్ పూర్తిగా ఆగిపోవని హోంశాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అన్నారు. “ఐబొమ్మతో పైరసీ ఆగిపోతుందా?” అంటూ Xలో చేసిన పోస్టుపై ఆయన స్పందించారు. ‘ఒకడు పోతే మరొకడు వస్తాడు. ఈ నేరాలు కొనసాగుతూనే ఉంటాయి. మన చేతిలో ఉంది నివారణ ఒక్కటే. తక్షణమే డబ్బు సంపాదించాలన్న ఆశ తగ్గించుకోవాలి. సైబర్ నేరాలకు ఇదే మూల కారణం. రాజమౌళి చెప్పినట్లు జీవితంలో ఏదీ ఫ్రీగా రాదు’ అని పేర్కొన్నారు.


