News May 2, 2024
ఈనెల 6 నుంచి మోస్తరు వర్షాలు

TG: మండుతున్న ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ఈనెల 6 నుంచి కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండ జిల్లా గూడపూర్‌లో అత్యధికంగా 46.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది.
Similar News
News April 7, 2026
ఇది MAVIGUNపై చర్చను దారి మళ్లించడమే: జగన్

మహిళలను ఉద్దేశించి ABN రాధాకృష్ణ చేసిన <<19591145>>వ్యాఖ్యలను<<>> ఖండిస్తున్నట్లు YCP చీఫ్ జగన్ అన్నారు. ‘ఇది మహిళలను అవమానించడమే కాదు, ప్రజల్లో MAVIGUNపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడమే. తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా మా నాయకులు, కార్యకర్తలు సంయమనంతో ఉన్నారు. RKపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వ్యాఖ్యలను సమర్థించిన నేతల వైఖరిని ఖండిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.

ఉత్కంఠ.. ఈ అర్ధరాత్రి ఏం జరగనుంది?

‘ఈ రాత్రికి అందరూ చనిపోతారు’ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ప్రజలకు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఇది. దీంతో రాత్రికి ఏం జరగనుందని ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మరోవైపు పవర్ ప్లాంట్లపై అమెరికా దాడి చేస్తే రీజియన్ మొత్తం అంధకారం అవుతుందని ఇరాన్ అంటోంది. తాజా హెచ్చరికలు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్నాయి. వార్ తీవ్రరూపం దాలిస్తే ‘ఎనర్జీ’ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుందని ఆందోళన చెందుతున్నాయి.