News August 3, 2024

రేపు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

image

AP: అల్లూరి, ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, YSR జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Similar News

News December 3, 2025

ఉప్పల్ నుంచి యాదాద్రి.. వేగంగా విస్తరణ

image

ఉప్పల్ నుంచి యాదాద్రి వెళ్లే వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఓ వైపు అండర్ ఫ్లో వర్క్, లేన్ల విస్తరణ సైతం కొనసాగుతోంది. ప్రత్యేక ఇంజినీరింగ్ యంత్రాలతో గత నాలుగు రోజులుగా పనుల్లో మరింత వేగం పెంచినట్లుగా AEE సాయికుమార్ తెలిపారు. NHAI అధికారుల బృందం పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, మెటీరియల్ టెస్టింగ్ నిర్వహిస్తుంది.

News December 3, 2025

ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు పెట్టాలి: CBN

image

AP: వ్యవసాయోత్పత్తులు గ్లోబల్ బ్రాండ్‌గా మారాలని తూ.గో.జిల్లా నల్లజర్లలో ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమంలో CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు పెట్టుకోవాలి. ఫ్యాక్టరీలు, మార్కెట్‌తో అనుసంధానమవ్వాలి. ఏ పంటలతో ఆదాయమొస్తుంది? ఏ కాంబినేషన్ పంటలు వేయాలి? పరిశ్రమలకు అనుసంధానం ఎలా చేయాలి? రైతులే పరిశ్రమలు ఎలా పెట్టాలన్న అంశాలపై ప్రభుత్వం సహకరిస్తుంది’ అని తెలిపారు.

News December 3, 2025

మీక్కూడా ఫేవరెట్ కిడ్ ఉన్నారా?

image

చాలా కుటుంబాల్లో తెలియకుండానే ‘ఫేవరెట్‌ కిడ్‌’ ప్రభావం కనిపిస్తుందంటున్నారు నిపుణులు. తల్లిదండ్రుల ప్రేమలో తేడా లేకపోయినా.. చిన్నచిన్న సందర్భాల్లో ఈ పక్షపాతం బయట పడుతుంది. కొన్నిసార్లు ఒకరితో ఎక్కువ ఓపికగా, ఆప్యాయంగా ఉండటం చేస్తుంటారు. కొన్నిసార్లు ఇది తల్లిదండ్రులు కూడా గ్రహించకపోవచ్చు. తల్లిదండ్రులు తమను తక్కువగా చూస్తున్నారనే భావన పిల్లల్లో నెగెటివ్‌ ఆలోచనలను పెంచుతుందని చెబుతున్నారు.