News December 11, 2024
నేడు ఓ మోస్తరు వానలు.. రేపు భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేడు APలో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయంది. రేపు నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.
Similar News
News September 21, 2025
ఇజ్రాయెల్ దాడులు.. ఒక్క రోజే 91 మంది మృతి!

గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒక్క రోజే 91 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇళ్లు, షెల్టర్లు, వాహనాలపై దాడులు జరిగినట్లు తెలిపింది. పేలుడు పదార్థాలు నింపిన రోబోలను ఇజ్రాయెల్ దళాలు వాడుతున్నట్లు పేర్కొంది. గత 2 వారాల్లో 20 టవర్ బ్లాక్‌లపై అటాక్స్ జరిగాయని, లక్షలాది మంది నిరాశ్రయులైనట్లు వెల్లడించింది. అటు యుద్ధం ఆపేయాలంటూ వేలాది మంది టెల్ అవీవ్‌లో నిరసనలకు దిగారు.
News September 21, 2025
సంతానోత్పత్తిని పెంచే సీడ్ సైక్లింగ్

మహిళల సంతానోత్పత్తిలో హార్మోన్లు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని సమతుల్యంగా ఉంచడానికి సీడ్ సైక్లింగ్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సీడ్ సైక్లింగ్ అనేది అవిసె, గుమ్మడి, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి విత్తనాలను ఒక ప్రత్యేక విధానంలో తినే ఒక ప్రకృతి వైద్య చికిత్స. ఇది PMS లక్షణాలను తగ్గించడానికి, ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. వీటిని సలాడ్లు, స్మూతీల్లో వేసుకొని తినొచ్చు.
News September 21, 2025
సీడ్ సైక్లింగ్ ఎలా చేయాలంటే?

సీడ్ సైక్లింగ్‌లో పీరియడ్ 1-14 రోజు వరకు రోజుకు అవిసె, గుమ్మడికాయ విత్తనాలను తీసుకోవాలి. 14వరోజు నుంచి పీరియడ్స్ మొదటి రోజు వరకు పొద్దుతిరుగుడు, నువ్వుల గింజలను తీసుకోవాలి. రెగ్యులర్ పీరియడ్‌లో మొదటి 14 రోజులు ఫోలిక్యులర్ దశ, తర్వాత లూటియల్ దశ ఉంటాయి. ఆ సమయానికి తగ్గట్లు సీడ్స్ తీసుకోవడం వల్ల ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయిలు సమతుల్యతతో ఉంటాయి. ఇవి గర్భం దాల్చడంలో సహాయపడతాయి.