News June 18, 2024

రూ.2,324 కోట్లతో ఐటీఐల ఆధునికీకరణ: CM రేవంత్

image

TG: రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు(ATC)గా అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.2,324 కోట్లు ఖర్చు చేయన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు ఆయన శంకుస్థాపన చేశారు. కాగా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను నియమించనున్నట్లు ప్రభుత్వం వర్గాలు తెలిపాయి.

Similar News

News March 4, 2026

యూరియా ఉత్పత్తి తగ్గుదల.. పెరగనున్న రేట్లు?

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం కారణంగా ఖతర్‌లో LNG <<19281702>>ఉత్పత్తి<<>> నిలిచిపోవడంతో ఇండియాలో యూరియా ప్రొడక్షన్‌‌ను కంపెనీలు తగ్గిస్తున్నాయి. యూరియా ఉత్పత్తికి LNG ప్రైమరీ ఫీడ్‌స్టాక్. ఇది ఎనర్జీ సోర్స్‌గానే కాకుండా ఎరువుల తయారీ ప్రక్రియలోనూ కీలకమైన ఇన్‌పుట్. యూరియా కొరత ఏర్పడితే రేట్లు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని ఎరువుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.

News March 4, 2026

ఫిన్+టిమ్= అదిరెన్.. T20WCలో సరికొత్త చరిత్ర

image

T20WC-2026లో కివీస్ ఓపెనర్లు <<19299520>>ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్<<>> రికార్డు సృష్టించారు. వీరిద్దరూ ఈ ఎడిషన్‌లో 10.93 రన్ రేట్‌తో 463 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. T20WC హిస్టరీలో పరుగులు, రన్ రేట్ పరంగా ఇవే అత్యధికం. 2024లో ఇబ్రహీం-గుర్బాజ్ 7.6 RRతో 446 రన్స్, 2021లో బాబర్-రిజ్వాన్ 7.33 RRతో 411 పరుగులు, 2022లో బట్లర్-హేల్స్ 9.2 RRతో 368 రన్స్, 2007లో గిల్‌క్రిస్ట్-హెడెన్ 8.93 RRతో 335 పరుగులు చేశారు.

News March 4, 2026

మావోయిస్టుల లొంగుబాట్లపై అమిత్ షాకు సీఎం రిపోర్ట్

image

ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్‌ షాతో సీఎం రేవంత్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. మావోయిస్టుల లొంగుబాట్లపై సీఎం నివేదిక ఇచ్చారు. ఆపరేషన్‌ కగార్‌కు తెలంగాణ పోలీసులు సహకరించారని, మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయేలా చూడాలని షా కోరారు. తెలంగాణలో ఈగల్‌ టీమ్‌ను బలోపేతం చేయాలని సూచించారు. ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ ఏర్పాటు గురించి రేవంత్ వివరించారు. రాష్ట్రానికి IPS క్యాడర్‌ను పెంచాలని కోరారు.