News September 17, 2024
మోదీ @ 74: పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

ప్రధాని నరేంద్రమోదీ నేడు 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయా రాష్ట్రాల CMలు, కేంద్ర మంత్రులు, BJP నేతలు, ఫ్యాన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘భరతమాత ముద్దుబిడ్డ, విజనరీ లీడర్, పీఎం మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. బలమైన, సంపన్నమైన భారత్ను నిర్మించాలన్న మీ విజన్ అందరి హృదయాల్లో ధ్వనిస్తోంది. అంకితభావంతో దేశాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్తు తరాలకు ప్రేరణనివ్వాలి’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
Similar News
News January 24, 2026
నేడు నగరిలో చంద్రబాబు పర్యటన

AP: నేడు CM చంద్రబాబు చిత్తూరు(D) నగరిలో పర్యటించనున్నారు. 11AMకు నగరి జూ. కాలేజ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడే ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటారు. తర్వాత శాప్ మైదానంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రజా వేదికలో పాల్గొంటారు. అక్కడ స్వచ్ఛ రథాలను ప్రారంభిస్తారు. అనంతరం జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో TDP శ్రేణులతో సమావేశమవుతారు. సాయంత్రం తిరుగు పయనమవుతారు.
News January 24, 2026
డెయిరీ ఫామ్ ప్రారంభించే ముందు ఇవి చేయాలి

డెయిరీ ఫామ్ ప్రారంభానికి ముందు కొంత భూమిలో నేపియర్, గినీ గడ్డి, జొన్న.. మరి కొంత భూమిలో అలసంద, పిల్లిపెసర, లూసర్న్ పశుగ్రాసాలను సాగుచేయాలి. సుబాబుల్, అవిసె చెట్లను ఫామ్ పెట్టే స్థలం చుట్టూ కంచెలా వేయాలి. ఇలా పశుగ్రాసాన్ని పెంచి, షెడ్లు కట్టిన తర్వాత పరికరాలు, మందులు కొనుగోలు చేశాక పాడి పశువులను కొనాలంటున్నారు నిపుణులు. అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్ <<>>చేయండి.
News January 24, 2026
IRELలో 30 పోస్టులకు నోటిఫికేషన్

కేరళలోని ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (<


