News August 17, 2024
హరియాణాలో హ్యాట్రిక్‌పై మోదీ గురి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1723868651838-normal-WIFI.webp)
హరియాణాలో హ్యాట్రిక్ కొట్టాలని BJP కసరత్తు మొదలుపెట్టింది. ప్రధాన నాయకత్వంతో మోదీ శుక్రవారం రాత్రి హై లెవల్ మీటింగ్ నిర్వహించారు. నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్, మనోహర్ లాల్‌తో ఎన్నికల వ్యూహం గురించి చర్చించారు. బీజేపీ గత వారమే రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడు, ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ను నియమించింది. రాష్ట్రంలో విపక్ష కూటమి బలపడటం, కుల సమీకరణాలు మారడం, అధికార పక్షంపై వ్యతిరేకత ఆ పార్టీకి సవాల్‌గా మారాయి.
Similar News
News February 10, 2025
రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ కన్నీళ్లే: హరీశ్ రావు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739193523304_1032-normal-WIFI.webp)
TG: కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు కన్నీళ్లే మిగిలాయని BRS నేత హరీశ్ రావు అన్నారు. ధర్నా చౌక్ వద్ద RMP, PMPల ధర్నాలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికలకు ముందు ప్రజలు నమ్మడం లేదని రాహుల్ గాంధీతో బాండ్ పేపర్లు రాయించారు. ఆ హామీలన్నీ ఏమయ్యాయి? ఒక్కటీ అమలు కావడం లేదు. 11 సార్లు ఢిల్లీ వెళ్లినా రేవంత్ సాధించిందేమీ లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక అందరి బతుకులు రోడ్డున పడ్డాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News February 10, 2025
కల్తీ నెయ్యి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737944091889_1045-normal-WIFI.webp)
AP: తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలు వెల్లడించింది. నిందితులు ఆధారాలు చెరిపేసేందుకు పాత ఫోన్లు ధ్వంసం చేసి కొత్తవి కొన్నారని తెలిపింది. నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకున్నా ఏఆర్, వైష్ణవి డెయిరీలు టెండర్లలో పాల్గొన్నాయని పేర్కొంది. బోలేబాబా డెయిరీ నెయ్యిని తమ పేరు మీద టీటీడీకి సరఫరా చేసినట్లు వివరించింది. నిందితులు విచారణకు సహకరించడంలేదని తెలిపింది.
News February 10, 2025
’మహామండలేశ్వర్‘ పదవికి మమత రాజీనామా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739191392706_1032-normal-WIFI.webp)
తాను కిన్నర్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ నటి మమతా కులకర్ణి ప్రకటించారు. ఇకపై సాధ్విగానే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. కాగా 90ల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న మమత ఆ తర్వాత సినిమాల నుంచి తప్పుకున్నారు. ఓ డ్రగ్స్ రాకెట్‌లోనూ ఆమె పేరు వినిపించింది. ఇటీవల మహాకుంభమేళాలో ఆమె కిన్నర్ అఖాడాలో చేరి సన్యాసినిగా మారారు. కానీ దీనిపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.