News August 9, 2024

ఒకే సమావేశంలో మోదీ, రాహుల్

image

ఈరోజు పార్లమెంటు భవనంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పార్లమెంటు ఆవరణలో ఒకే టీ పార్టీలో ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోదీ, రాహుల్ నవ్వుతూ పలకరించుకోవడం విశేషం. స్పీకర్ ఓంబిర్లా పక్కన మోదీ కూర్చోగా మరోపక్క రాహుల్‌ కూర్చున్న సోఫాలోనే కేంద్ర మంత్రులు, ఇతర ఎంపీలున్నారు.

Similar News

News December 23, 2025

నేడు పంచముఖ హనుమంతుడిని పూజిస్తే..?

image

మంగళవారం నాడు పంచముఖ హనుమంతుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. జాతకంలోని కుజ దోష నివారణకు, రుణ బాధల నుంచి విముక్తి కోసం ఈ పూజ చేయాలంటున్నారు. ‘5 ముఖాల స్వామిని ఆరాధించడం వల్ల 5 దిశల నుంచి రక్షణ లభిస్తుంది. వ్యాధుల నుంచి విముక్తి, శత్రువులపై విజయం సాధిస్తారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞానం లభిస్తాయి’ అంటున్నారు.

News December 23, 2025

BSF 549 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>BSF <<>>స్పోర్ట్స్ కోటాలో 549 కానిస్టేబుల్ (GD)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు DEC 27- JAN 5 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ పాసై, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తున్న, 18 -23 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. PST, స్పోర్ట్స్ ప్రదర్శన, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: rectt.bsf.gov.in/

News December 23, 2025

హైట్‌ను పెంచే హస్తపాదాసనం

image

ప్రతిరోజూ హస్తపాదాసనం సాధన చెయ్యడం ఎత్తు పెరగడంలో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. రెండు కాళ్లు దగ్గరగా పెట్టి నిల్చొని గట్టిగా శ్వాస పీల్చి ముందుకు వంగాలి. చేతులు నేలపై ఆనించాలి. తలను మోకాళ్లకు తాకించాలి. మోకాళ్లను వంచకుండా ఈ భంగిమలో కాసేపు ఉండాలి. తరువాత యథాస్థానానికి రావాలి. ఇలా నాలుగైదు సార్లు చేయాలి. ఈ ఆసనం రోజూ సాధన చేస్తే పూర్తిస్థాయిలో చేయడం వీలవుతుంది.