News August 8, 2025
పుతిన్‌కు మోదీ ఫోన్.. భారత పర్యటనకు ఆహ్వానం

రష్యాతో భారత్ బంధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఆయనను భారత్‌లో పర్యటించాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధం విషయాన్ని పుతిన్ మోదీ దృష్టికి తీసుకొచ్చారు. అటు ఇప్పటికే రష్యా పర్యటనలో ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ ఏడాది చివర్లో ఆయన ఇండియాలో పర్యటిస్తారని దోవల్ వెల్లడించారు.
Similar News
News August 8, 2025
ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేవారికి గుడ్‌న్యూస్

TG: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఇకపై ఆధార్ ఆధారిత చెల్లింపులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలు, IFSC నంబర్లలో తప్పుల వల్ల చాలామంది అకౌంట్లలో డబ్బులు జమ కావడం లేదు. దీనిపై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. తాజాగా 9,100 ఆధార్ ఆధారిత చెల్లింపులు చేపట్టగా మెరుగైన ఫలితాలు కనిపించాయి. దీంతో ఇదే విధానంలో చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
News August 8, 2025
అట్టహాసంగా ప్రారంభమైన APL సీజన్- 4

AP: వైజాగ్ వేదికగా ‘ఆంధ్రా ప్రీమియర్ లీగ్’ సీజన్ 4 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, హీరో వెంకటేశ్ హాజరయ్యారు. వారికి ACA అధ్యక్షుడు MP కేశినేని చిన్ని స్వాగతం పలికారు. నటి ప్రగ్యా జైస్వాల్ డాన్స్, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ ప్రదర్శన అలరించింది. లేజర్, డ్రోన్ షోస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్ మధ్య తొలిమ్యాచ్ జరుగుతోంది.
News August 8, 2025
సినీ ముచ్చట్లు

*యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ మూవీ రెయిన్ సాంగ్
*నాని ‘ప్యారడైజ్’ మూవీ కొత్త పోస్టర్ రిలీజ్
*ఆగస్టు 14న రిలీజవుతున్న కూలీ చిత్రంలో ‘శివ’ 4K రీరిలీజ్ ట్రైలర్
*తమిళనాడు వేలంకన్ని చర్చి, నాగూర్ దర్గాలు సందర్శించిన హీరోయిన్ శోభిత