News May 3, 2024
6, 8 తేదీల్లో ఏపీలో మోదీ ప్రచారం

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 6, 8న మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మూడు భారీ బహిరంగ సభలు, ఒక రోడ్‌షోలో పాల్గొంటారు. 6న రాజమండ్రి, అదే రోజు సాయంత్రం అనకాపల్లిలో బహిరంగ సభలు, 8న కలికిరిలో బహిరంగ సభ, విజయవాడలో భారీ రోడ్ షో చేపడతారు.
Similar News
News March 10, 2026
స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. లెక్కలు ఇవి

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పాస్ కావాలంటే సభలో హాజరై, ఓటు వేసిన సభ్యులలో సగం కంటే ఎక్కువ మంది మద్దతు ఉండాలి. అంటే ప్రస్తుతం ఉన్న 543 సభ్యుల్లో 273 మంది సపోర్ట్ అవసరం. ప్రస్తుతం INDIA కూటమి బలం సుమారు 234 సీట్లు. విపక్షాలు అన్నీ ఓటు వేసినా NDA మెజారిటీ (293)ని దాటలేవు. దీంతో తీర్మానం వీగిపోయే అవకాశమే ఎక్కువ. స్పీకర్ ఓం బిర్లా తన పదవిలో కొనసాగే అవకాశమే ఎక్కువగా ఉంది.
News March 10, 2026
AIIMS ఢిల్లీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

AIIMS ఢిల్లీ 16 రీసెర్చ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS/BDS/BHMS/BUMS /BAMS, పీజీ(ఎపిడిమాలజీ/పబ్లిక్ హెల్త్/కమ్యూనిటీ మెడిసిన్, సోషల్ సైన్సెస్), BSc(నర్సింగ్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.aiims.edu
News March 10, 2026
నిద్రపోతున్న హనుమంతుడు.. పాదాల చెంత శనిదేవుడు!

MH లోనార్‌లో ‘మోతా మారుతి’ ఆలయం అతి పవిత్రమైనది, అరుదైనది. ఇక్కడ హనుమంతుడు భారీ పరిమాణంలో దర్శనమిస్తారు. శయన రూపంలో ఉండటం విశేషం. ఈ విగ్రహం అయస్కాంత శక్తి కలిగిన శిలతో తయారైందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సాక్షాత్తూ శనిదేవుడే ఇక్కడ స్వామివారి పాదాల చెంత సేవకుడిగా ఉంటాడని నమ్ముతారు. ఇక్కడ కొలువైన హనుమంతుడిని ఏలినాటి, సమస్త శని దోషాలు పోతాయని ప్రతీతి. ఆధ్యాత్మికత, అద్భుత శిల్పకళకు ఈ గుడి నిలయం!


