News October 28, 2024

ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ అంతం చేయగలరు: జెలెన్‌స్కీ

image

రష్యా తమపై చేస్తున్న యుద్ధాన్ని ఆపడంలో PM మోదీ కీలక పాత్ర పోషించగలరని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు. ‘అనేక అంశాల్లో భారత్‌ది ప్రపంచంలో తిరుగులేని స్థానం. అలాంటి దేశానికి మోదీ ప్రధానిగా ఉన్నారు. ఆయన కేవలం యుద్ధం వద్దని చెప్తే సరిపోదు. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ నుంచి వేలాదిమంది పిల్లల్ని మాస్కో తమ దేశానికి తీసుకెళ్లింది. వారిని మాకు వెనక్కి ఇప్పించడంలో మోదీ సహాయం చేయాలి’ అని కోరారు.

Similar News

News October 28, 2024

దీపావళికి ఏ సినిమాకు వెళ్తున్నారు?

image

ఈసారి దీపావళికి బాక్సాఫీస్ వద్ద బడా హీరోల మోతలు లేవు. ‘క’, లక్కీ భాస్కర్, అమరన్, బఘీర వంటి విభిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. ‘క’ థ్రిల్లర్ నేపథ్యంలో, లక్కీ భాస్కర్ విభిన్న కథాంశంతో తెరకెక్కినట్లుగా కనిపిస్తున్నాయి. ‘అమరన్’ జవాన్ జీవిత కథ ఆధారంగా, బఘీర యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కాయి. వీటితో పాటు భూల్ భులయ్యా-3, జీబ్రా వంటి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో మీరు ఏ సినిమాకు వెళ్తున్నారు?

News October 28, 2024

సచివాలయ భద్రతా సిబ్బందికి CSO వార్నింగ్

image

TG: సచివాలయ భద్రతా సిబ్బందికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్(CSO) హెచ్చరికలు జారీ చేశారు. సిబ్బంది కదలికలు, సోషల్ మీడియాపై నిఘా ఉందని ప్రకటనలో తెలిపారు. పోలీసులను రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వాట్సాప్ గ్రూపుల నుంచి తప్పుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకమైన పోస్టులను లైక్, షేర్ చేయవద్దన్నారు. ఏదైనా తప్పు జరిగినట్లు గుర్తిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

News October 28, 2024

90% నకిలీ బాంబు బెదిరింపులు యూకే నుంచే!

image

విమానాల‌కు న‌కిలీ బాంబు బెదిరింపుల‌పై దర్యాప్తు సంస్థలకు మొద‌టి లీడ్ ల‌భించిన‌ట్టుగా తెలుస్తోంది. గ‌త రెండు వారాల్లో వచ్చిన 400ల‌కు పైగా న‌కిలీ బెదిరింపుల్లో 90% వ‌ర‌కు యునైటెడ్ కింగ్‌డ‌మ్ నుంచి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ మేర‌కు VPN, డార్క్ వెబ్ అడ్రస్‌ల ద్వారా కౌంట‌ర్ టెర్ర‌రిజ‌మ్ డివిజ‌న్‌ గుర్తించ‌గ‌లిగిన‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంలో NIA కూడా ద‌ర్యాప్తు చేస్తోంది.