News December 14, 2024

మోదీ, CBN, జగన్ ముద్దాయిలు: షర్మిల

image

AP: విజన్-2047 పేరుతో చంద్రబాబు మరోసారి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని APCC చీఫ్ షర్మిల విమర్శించారు. రాష్ట్రం దిశ మారాలంటే విజన్లు కాదని, విభజన హామీలు నెరవేరాలని మండిపడ్డారు. పదేళ్లలో ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పన్నుల్లో రాయితీలు ఉండి, వేలసంఖ్యలో పరిశ్రమలు వచ్చి లక్షలాది మందికి ఉపాధి దక్కేదన్నారు. విభజన హామీలు బుట్టదాఖలు చేసినవారిలో మోదీ, CBN, జగన్ తొలి ముగ్గురు ముద్దాయిలని షర్మిల ధ్వజమెత్తారు.

Similar News

News December 2, 2025

ములుగు: ఎస్సై హరీశ్ మృతి.. నేటికి ఏడాది!

image

ములుగు జిల్లా వాజేడు ఎస్సైగా పని చేసిన రుద్రారపు హరీశ్ బలవన్మరణానికి పాల్పడిన ఘటనకు నేటికీ ఏడాది. డిసెంబర్ 2న ఆయన ముళ్లకట్ట వద్దనున్న రిసార్టులో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తన మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని, మృతి చెందిన సమయంలో తనతో యువతి సైతం రీసార్ట్‌లో పక్కనే ఉండడం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.

News December 2, 2025

ఆ ఎస్జీటీలకు 6 నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరి: విద్యాశాఖ

image

AP: బీఈడీ క్వాలిఫికేషన్‌తో ఎస్జీటీలుగా నియమితులైన వారు ఆరు నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరిగా పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. 2018-23 మధ్య కాలంలో నియమితులైన వారు ఈ నెల 25 వరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఎస్జీటీ ఉద్యోగాలకు డీఈడీ చేసినవారే అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

News December 2, 2025

పెట్టుబడుల వరద.. 6 నెలల్లో ₹3 లక్షల కోట్లు!

image

దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల్లో రూ.3.15 లక్షల కోట్లు($35.18B) వచ్చాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువ. అమెరికా నుంచి వచ్చిన FDIలు రెట్టింపు కావడం గమనార్హం. ఇక FDIలను ఆకర్షించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ($10.57B), కర్ణాటక ($9.4B) టాప్‌లో ఉన్నాయి. తెలంగాణకు $1.14B పెట్టుబడులు వచ్చాయి.