News October 28, 2024
ఓబీసీలను మోదీ వంచించారు: కాంగ్రెస్

కులగణనకు అంగీకరించకుండా OBCలను ప్రధాని మోదీ వంచించారని కాంగ్రెస్ విమర్శించింది. వచ్చే ఏడాది జనగణనకు సిద్ధమైన కేంద్రం కులగణనను విస్మరించడాన్ని ప్రధాన విపక్షం తప్పుబట్టింది. ఈ విషయంలో NDA ప్రభుత్వాన్ని ఆపుతున్నదేంటని ప్రశ్నించింది. మోదీ తన రాజకీయ అహంకారంతో కులగణనను పక్కనపెట్టారంది. దీనిపై NDA మిత్రపక్షాలైన JDU, TDPల వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేసింది.
Similar News
News January 10, 2026
764 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

DRDOకు చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్(CEPTAM)లో 764 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా, BSc, BLSc, MLSc, టెన్త్, ITI అర్హత కలిగినవారు అర్హులు. వయసు 18-28 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ బట్టి ఏజ్ సడలింపు ఉంటుంది. టైర్1, టైర్ 2 రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీ వెళ్లండి.
News January 10, 2026
గ్రీన్లాండ్పై డెన్మార్క్కు ట్రంప్ వార్నింగ్

గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవడంపై US అధ్యక్షుడు ట్రంప్ డెన్మార్క్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘వారికి నచ్చినా నచ్చకపోయినా గ్రీన్లాండ్పై మేమో నిర్ణయానికి వచ్చాం. ఈజీగా ఒక డీల్ చేసుకోవాలి అనుకుంటున్నాం. అది సాధ్యం కాకపోతే కష్టమైన దారిని ఎంచుకోవాల్సి వస్తుంది. ఆ పని మేము చేయకపోతే రష్యా, చైనా చేస్తాయి. అందుకు అమెరికా సిద్ధంగా లేదు. ఏదేమైనా గ్రీన్లాండ్ విషయంలో వెనక్కి తగ్గం’ అని స్పష్టం చేశారు.
News January 10, 2026
NHIDCLలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<


