News December 24, 2024
బడ్జెట్పై ఆర్థికవేత్తలతో మోదీ సమాలోచనలు
కేంద్ర బడ్జెట్లో పొందుపరచాల్సిన అంశాలు, కేటాయింపులపై సలహాలు, సూచనలు తీసుకొనేందుకు ఆర్థికవేత్తలు, భిన్న రంగాల నిపుణులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. Feb 1న నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. Niti Aayog Vice-Chairman సుమన్ బేరీ, CEO సుబ్రహ్మణ్యం, Chief Economic Advisor అనంత నాగేశ్వరన్, ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 25, 2024
నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
TG: CM రేవంత్ రెడ్డి ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఆయన తొలుత ఏడుపాయల వనదుర్గమాత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆపై అక్కడే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం మెదక్ CSI చర్చి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారని చెప్పాయి. అటు, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కూడా నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు.
News December 25, 2024
నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ
AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న CM చంద్రబాబు ఇవాళ బిజీగా గడపనున్నారు. తొలుత మాజీ PM వాజ్పేయి శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం BJP జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే NDA నేతల సమావేశానికి హాజరవుతారు. జమిలి, వక్ఫ్ బిల్లులపై చర్చిస్తారు. అలాగే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సీఎం భేటీ అవుతారని సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్తారని తెలుస్తోంది.
News December 25, 2024
ఏపీకి రూ.446 కోట్లు విడుదల
AP: రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం గ్రాంటు రూ.446 కోట్లను కేంద్రం విడుదల చేసింది. 2024-25కుగానూ రెండో వాయిదా కింద రూ.421 కోట్లు, ఒకటో వాయిదా కింద పెండింగ్లో ఉన్న రూ.25 కోట్లను అందించింది. 13,097 గ్రామ పంచాయతీలు, 650 బ్లాక్ పంచాయతీలకు ఈ నిధులకు కేటాయించనున్నారు.