News April 6, 2025
మోదీ కౌంటర్..సంతకాలైనా తమిళంలో చేయండి

వైద్య విద్యను తమిళంలో అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి ప్రధాని మోదీ సూచించారు. రాష్ట్రం నుంచి వచ్చిన వినతి పత్రాలలో సంతకాలు తమిళంలో ఉండవని, కనీసం సంతకాలైనా మాతృభాషలో చేస్తే బాగుంటుందని రాష్ట్ర నాయకులకు సూచించారు. తమిళ భాష, సంస్కృతి అభివృద్ధి కోసం కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. జాతీయ విద్యా విధానం అమలు చేస్తే తమిళ భాషకు అన్యాయం జరుగుతుందని స్టాలిన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News April 8, 2025
విద్యార్థులకు ట్రంప్ ఝలక్.. చిన్న తప్పు చేసినా వీసా రద్దు?

ట్రంప్ నిర్ణయాలు విదేశీ విద్యార్థుల పట్ల శాపంగా మారుతున్నాయి. చిన్న పాటి ట్రాఫిక్ ఉల్లంఘనలకూ వీసాలు రద్దు చేస్తున్నారని ఆ దేశ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. గాజాపై ఇజ్రాయిల్ దాడిలో హమాస్కు మద్దతుగా పోస్టులు పెట్టిన విద్యార్థుల వివరాలు అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. హార్వర్డ్, స్టాన్ఫర్డ్ వర్సిటీల అధికారులు సైతం ఆకస్మిక వీసాల రద్దుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
News April 8, 2025
పీఎం మోదీతో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ భేటీ

పీఎం నరేంద్ర మోదీతో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ భేటీ అయ్యారు. వీరిద్దరూ ఢిల్లీలో అత్యున్నత సమావేశం నిర్వహించారు. వీరితోపాటు విదేశాంగమంత్రి జైశంకర్, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఉన్నారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సహకారంపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా క్రౌన్ ప్రిన్స్ ఇవాళ, రేపు భారత్లో పర్యటిస్తారు.
News April 8, 2025
2026 నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి: మంత్రి రామ్మోహన్

AP: భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పనులు 71% పూర్తయ్యాయని పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఈ ఎయిర్పోర్ట్ ఒక్కటే అధునాతనమైందని, దీంతో దేశ రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నామని, 2026 నాటికి పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. మంత్రి ఇవాళ విమానాశ్రయ పనులను పరిశీలించారు.