News July 9, 2024
భారత ప్రజలకోసం మోదీ జీవితాన్ని అంకితం చేశారు: పుతిన్

రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీపై ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. మోదీ తన జీవితాన్ని భారత ప్రజలకు అంకితం చేశారని కొనియాడారు. చరిత్రాత్మక స్థాయిలో 3వసారి గెలుపొందారంటూ అభినందనలు తెలిపారు. పీఎం 2 రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. ఆయనకు నోవో-ఒగరెవోలోని తన నివాసంలో పుతిన్ సాయంకాల విందు ఏర్పాటు చేయడం విశేషం.
Similar News
News November 28, 2025
వరంగల్ కాళోజీ వర్సిటీ వీసీ రాజీనామా

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వ్యవహారాలపై ఆరోపణలు రావడంతో <<18416226>>CM ఆగ్రహం <<>>వ్యక్తం చేయగా వీసీ నందకుమార్ రాజీనామా చేశారు. యూనివర్సిటీలో డబ్బులు తీసుకొని రీకౌంటింగ్లో నలుగురికి <<18401167>>మార్కులు కలిపారని<<>> విజిలెన్సు విచారణలో ప్రాథమికంగా తేలింది. నోటిఫికేషన్లు లేకుండా సిబ్బంది నియామకం అంశం, BRSనేత హరీశ్ రావు గవర్నర్కు ఫిర్యాదుచేయడంతో ప్రభుత్వానికి మరక అంటొద్దనే ఉద్దేశంతో రాజీనామాచేసినట్టు తెలుస్తోంది.
News November 28, 2025
మంచాన్ని గోడలకు ఆనించవచ్చా?

మంచాన్ని గోడకు ఓవైపు మాత్రమే ఆనించి ఉంచాలని, అదే శ్రేయస్కరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. మిగిలిన 3 వైపులా వీలైనంత ఖాళీ స్థలం ఉండాలంటున్నారు. ‘మంచంపై నుంచి వ్యక్తులు సులభంగా దిగడానికి, ఎక్కడానికి అనుకూలంగా ఉండాలి. గదిలో ఇరుకు ఉండకుండా, ఏ ఇబ్బంది లేకుండా నడిచేలా స్పేస్ ఉండాలి. దీనివల్ల శక్తి ప్రవాహం పెరుగుతుంది. 3 వైపులా గోడలు ఉంటే నిద్ర నాణ్యత దెబ్బతింటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 28, 2025
వింత ఆచారం.. అక్షింతలుగా బియ్యానికి బదులు జొన్నలు

తెలంగాణ వినూత్న ఆచారాలకు నిలయం. ఇక్కడ ప్రాంతాలను బట్టి ఆచారాలు, ఆహారపు అలవాట్లూ మారుతుంటాయి. అలాంటి ఓ ఆచారం ప్రకారం పెళ్లిలో అక్షింతలుగా బియ్యానికి బదులు జొన్నలను వాడటం కొన్నిచోట్ల కనిపిస్తుంది. జొన్నలను కొన్ని వర్గాల ప్రజలు బియ్యం కంటే పవిత్రంగా భావించి అక్షింతలుగా వాడతారట. ఆదిలాబాద్, వికారాబాద్, వెస్ట్ రంగారెడ్డి ప్రాంతాల్లోని పలు చోట్ల ఇది కనిపిస్తుంది. మీ ప్రాంతంలో ఈ ఆచారం ఉందా?COMMENT


