News March 26, 2024

సీఏఏతో మోదీ సర్కార్ కుట్ర: కేరళ సీఎం

image

ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని పౌరసత్వ సవరణ చట్టం(CAA) ద్వారా బీజేపీ కుట్ర పన్నుతోందని కేరళ CM పినరయి విజయన్ మండిపడ్డారు. ‘ముస్లిం పాలకులు, సాంస్కృతిక సారథులు ఎందరో దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారు. వాస్తవానికి భారత్ మాతాకీ జై, జైహింద్ అని నినదించింది ముస్లింలని సంఘ్ పరివార్‌కి తెలియదనుకుంటా. CAAకి వ్యతిరేకంగా పోరాడాలనే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదు’ అని ఫైర్ అయ్యారు.

Similar News

News October 3, 2024

తెలుగువారి కోసం Google కొత్త ఫీచర్

image

Gemini Live AI టూల్‌తో మరికొన్ని రోజుల్లో తెలుగులో కూడా సంభాషించవచ్చు. దేశంలో వాయిస్ అసిస్టెంట్ ఏఐ టూల్ వాడ‌కం పెరుగుతుండ‌డంతో Google దీన్ని మరిన్ని ప్రాంతీయ భాష‌లకు విస్తరించింది. ప్రస్తుతం ఇంగ్లిష్‌తోపాటు హిందీని కూడా ప్రవేశపెట్టింది. అలాగే మరికొన్ని రోజుల్లో తెలుగు, త‌మిళం, మ‌లయాళం, బెంగాలీ, మ‌రాఠీ, ఉర్దూ భాషల్లో తీసుకురానుంది. ఈ ఏడాదితో దేశంలో Google 20 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది.

News October 3, 2024

సురేఖ‌పై పరువు నష్టం దావా వేసిన నాగార్జున

image

నటి సమంత విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై నాగార్జున కోర్టుకు వెళ్లారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మంత్రి తన కుటుంబసభ్యుల పరువుకు భంగం కలిగించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దావాలో పేర్కొన్నారు.

News October 3, 2024

రేడియోలతో గిన్నిస్ వరల్డ్ రికార్డు

image

యూపీలోని గజ్రౌలాకు చెందిన రామ్ సింగ్ 1,257 యూనిక్ రేడియోలను కలిగి ఉండి గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కారు. ఇవి 1920 నుంచి 2010 మధ్య కాలంలోనివని ఆయన తెలిపారు. రామ్ సింగ్ వద్ద మొత్తం 1,400 రేడియోలు ఉండగా వీటిలో 1,257 ప్రత్యేకమైనవని గుర్తించారు. వీటిని ఢిల్లీ, మీరట్‌లో కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తు తరాలకు రేడియో గురించి తెలియజేసేందుకు వీటిని సేకరించినట్లు రామ్ సింగ్ పేర్కొన్నారు.