News November 2, 2024

మోదీ గ్యారంటీ అనేది క్రూరమైన జోక్‌: ఖ‌ర్గే

image

మోదీ గ్యారంటీ అనేది 140 కోట్ల మంది భార‌తీయుల‌పై ఓ క్రూర‌మైన జోక్ అని కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఖ‌ర్గే దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ గ్యారంటీల‌ను మోదీ విమ‌ర్శించడంపై ఖ‌ర్గే స్పందిస్తూ BJPలో B అంటే బిట్రేయ‌ల్(మోసం), J అంటే జుమ్లా(అబ‌ద్ధం) అని మండిప‌డ్డారు. 2 కోట్ల ఉద్యోగాలు, అచ్చే దిన్‌, విక‌సిత్ భార‌త్‌, నేను తిన‌ను-తిన‌నివ్వ‌ను, స‌బ్‌కా సాత్‌-స‌బ్‌కా వికాస్ నినాదాలు ఏమ‌య్యాయ‌ని ఖ‌ర్గే ప్ర‌శ్నించారు.

Similar News

News January 27, 2026

రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు: పొంగులేటి

image

TG: ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 0RR పరిధిలో 39 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను నిర్మిస్తున్నట్లు చెప్పారు. వివాహ రిజిస్ట్రేష‌న్ల కోసం మినీ మ్యారేజీ హాల్‌, గ‌ర్భిణులకు, వృద్ధుల‌కు లిఫ్ట్ తదితరాలు ఉంటాయన్నారు. రెండో విడతలో జిల్లా కేంద్రాల్లో భవనాలను నిర్మిస్తామని పేర్కొన్నారు.

News January 27, 2026

బొప్పాయిలో తెగుళ్ల నివారణకు సూచనలు

image

నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. విత్తన శుద్ధి తప్పక చేసుకోవాలి. నర్సరీల నుంచి మొక్కలను తీసుకుంటే వైరస్ తెగుళ్ల లక్షణాలు లేకుండా చూసుకోవాలి. ఏదైనా మొక్కలో వైరస్ తెగులు లక్షణాలు కనిపిస్తే దాన్ని పంట నుంచి తీసేసి దూరంగా కాల్చివేయాలి. తోటలో ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. బొప్పాయి నారు మొక్కలను పొలంలో నాటే 3 రోజుల ముందే లీటరు నీటికి 1.5గ్రా. అసిఫేట్ కలిపి పిచికారీ చేయాలి.

News January 27, 2026

విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉద్యోగాలు

image

విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 45 నాన్ అకడమిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు మార్చి 1వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, PG(లైబ్రరీ సైన్స్/ఇన్ఫర్మేషన్ సైన్స్), PhD, BE/BTech/MSc, MCA, డిప్లొమా, ఇంటర్, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, స్క్రీనింగ్ టెస్ట్, సబ్జెక్టివ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.