News April 25, 2024
మోదీ గ్యారంటీ భారత్కు పరిమితం కాదు: జైశంకర్

పీఎం మోదీ ఇచ్చే గ్యారంటీ భారత్కు మాత్రమే పరిమితం కాదని కేంద్రమంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘మోదీ గ్యారంటీ దేశ సరిహద్దుల వద్ద ఆగిపోదు. విదేశాల్లోని భారతీయుల భద్రత కూడా మాకు అత్యంత ముఖ్యం. కొవిడ్ అయినా, యుద్ధాలైనా మనవారిని రక్షించేందుకు మేం అన్నివేళలా సిద్ధం. గత ప్రభుత్వాల విదేశాంగ విధానం ఓటు బ్యాంకే ప్రామాణికంగా నడిచింది’ అని స్పష్టం చేశారు.
Similar News
News April 5, 2026
కొండగట్టు అంజన్నకు రూ.1.63 కోట్ల ఆదాయం!

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న హనుమాన్ జయంతి వేడుకలు కనులపండువగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయానికి రూ.1.63 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1.10 కోట్లు రాగా, దీక్షల విరమణ ద్వారా రూ.33.16 లక్షలు, దర్శనం తదితర సేవల ద్వారా మిగిలిన మొత్తాన్ని భక్తులు సమర్పించుకున్నారు.
News April 5, 2026
విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదు: హైకోర్టు

AP: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీనిపై గతంలో దేవదాయ శాఖ, శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. విదేశాలకు వెళ్లిన వారు సంప్రదాయాలకు విరుద్ధంగా జుట్టు కత్తిరించుకున్నారని, వారు గర్భాలయాల్లోకి వెళ్లకూడదన్న నిబంధన అమలు కావడం లేదంటూ ఓ అర్చకుడు కోర్టులో పిటిషన్ వేశారు.
News April 5, 2026
ఒకే కథ.. 3 ప్రాజెక్టులు!

‘కుమారస్వామి’ కథతో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా తెరకెక్కించాలని డైరెక్టర్ త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఈ కథాంశంతోనే మూవీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి ఆయన కేవలం నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్. కాగా ‘కుమారస్వామి’పై తానూ ఓ స్క్రిప్ట్ రాసుకున్నట్లు కిశోర్ తిరుమల కూడా గతంలో వెల్లడించారు. మరి వీటిలో ఏది ముందుగా థియేటర్లలోకి వస్తుందో చూడాలి.


