News March 16, 2024
తెలంగాణలో ఓటు అడిగే అర్హత మోదీకి లేదు: సీఎం రేవంత్

TG: రాష్ట్రానికి PM మోదీ చేసిందేమి లేదని CM రేవంత్ అన్నారు. ‘తెలంగాణను అవమానించిన మోదీకి ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అవినీతి పాలనపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్. ఎన్నికల నోటిఫికేషన్ సమయానికి డ్రామాకు తెరలేపారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే ఊరుకుంటామా? బీఆర్ఎస్-బీజేపీ కుట్ర చేస్తే తప్పా.. వారు అనుకుంటున్నది సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 5, 2025
నవంబర్ 24 నుంచి పార్లమెంటు సమావేశాలు!

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ చివరి వారంలో ప్రారంభం కానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంటు ఉభయ సభలు ఈనెల 24 లేదా 25 నుంచి సమావేశం అవుతాయని పేర్కొన్నాయి. డిసెంబర్ 19 వరకు ఇవి కొనసాగుతాయని చెప్పాయి. కాగా EC చేపట్టిన దేశవ్యాప్త SIRను వ్యతిరేకిస్తూ ఓట్ చోరీ అంటూ విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు దీనిపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. US టారిఫ్స్పైనా ప్రస్తావించవచ్చని తెలుస్తోంది.
News November 5, 2025
OFFICIAL: కమల్ ప్రొడక్షన్లో రజినీ సినిమా

తమిళ సినీ దిగ్గజాలు రజినీకాంత్, కమల్ హాసన్ ఓ సినిమా కోసం చేతులు కలిపారు. కమల్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లో రజినీకాంత్ హీరోగా ఈ మూవీ తెరకెక్కనుంది. దీనికి సి.సుందర్ దర్శకత్వం వహించనున్నారు. సూపర్ స్టార్కు 173వ సినిమా ఇది. ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు కమల్ హాసన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
News November 5, 2025
టీటీడీకి రూ.1000 కోట్ల విరాళాలు: బీఆర్ నాయుడు

AP: గత ఏడాది కాలంలో TTDకి రూ.1000Cr విరాళాలు వచ్చాయని బోర్డు ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. ఛైర్మన్గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘శ్రీవాణి ట్రస్ట్ కింద 5వేల ఆలయాలు నిర్మించాలని తీర్మానించాం. తిరుపతి-తిరుమల మధ్య ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని యోచిస్తున్నాం. తిరుపతి విమానాశ్రయానికి శ్రీవెంకటేశ్వర ఎయిర్పోర్టుగా నామకరణం చేస్తాం’ అని పేర్కొన్నారు.


