News August 26, 2025
ట్రంప్ కాల్స్‌ను మోదీ పట్టించుకోలేదు: జర్మనీ మీడియా

సుంకాల విషయంలో ట్రంప్ ఒత్తిళ్లకు భారత ప్రధాని మోదీ తలొగ్గలేదని జర్మనీ మీడియా సంస్థ FAZ తెలిపింది. ‘గత కొన్ని వారాల్లో సుంకాల విషయంలో ట్రంప్ చాలా సార్లు మోదీకి ఫోన్ కాల్ చేశారు. కానీ వాటిని ఆయన పట్టించుకోలేదు. కాల్స్‌కు సమాధానం ఇవ్వలేదు. టారిఫ్స్ పేరు చెప్పి ట్రంప్ మిగతా దేశాలను ఓడించారు కానీ ఇండియాను ఏమీ చేయలేకపోయారు’ అని పేర్కొంది. ఈ వార్తను భారత ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది.
Similar News
News August 26, 2025
తెలుగు ప్రజలకు సీఎం వినాయక చవితి శుభాకాంక్షలు

AP: గణేశుడిని పూజిస్తున్న ప్రజలకు సకల శుభాలు కలగజేయాలని ఆ వినాయకుడిని ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. రేపు వినాయక చవితి సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ‘మీ కుటుంబ ప్రగతికి, మీ లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ గణపతి మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. అటు రాష్ట్ర ప్రజలకు సకల శుభాలూ కలగాలని మాజీ సీఎం జగన్ ఆకాంక్షించారు.
News August 26, 2025
ముగిసిన టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ

TG: రాష్ట్రంలో టీచర్ల పదోన్నతుల ప్రక్రియ పూర్తయింది. 4,454 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్ లభించింది. 880 మంది స్కూల్ అసిస్టెంట్స్, 811 మంది SGTలకు హెడ్ మాస్టర్లుగా, 2,763 మంది SGTలకు స్కూల్ అసిస్టెంట్‌లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.
News August 26, 2025
కాబోయే భార్యతో భారత క్రికెటర్.. ఫొటో వైరల్

టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన కాబోయే భార్య వన్శికతో కలిసి తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. కుల్దీప్ బ్లాక్ సూట్‌లో, వన్శిక వైట్ గౌన్‌లో ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వీరిద్దరికి జూన్ 4న ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ ఏడాది చివర్లో వివాహం జరగనున్నట్లు సమాచారం. లక్నోకు చెందిన వన్శిక LICలో జాబ్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య చిన్ననాటి స్నేహం ప్రేమగా మారింది.