News June 4, 2024

వారణాసిలో మోదీ.. వయనాడ్‌లో రాహుల్ ఆధిక్యం

image

వారణాసి నుంచి పోటీలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆధిక్యంలో ఉన్నారు. అటు వయనాడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ లీడ్ కనబరుస్తున్నారు. మరోవైపు మండిలో BJP MP అభ్యర్థి కంగనా రనౌత్ వెనుకబడగా, బారామతిలో NCP శరద్ వర్గం నుంచి బరిలో నిలిచిన సుప్రియా సూలే లీడ్‌లో ఉన్నారు. మరోవైపు బీహార్‌లో లాలూ కూతుళ్లు ఇద్దరూ వెనకబడ్డారు. పాటలీపుత్రలో మీసా భారతి, సరన్ నుంచి రోహిణి NDA అభ్యర్థుల కంటే వెనకంజలో ఉన్నారు.

Similar News

News January 22, 2025

నిజమైన ప్రేమ దొరకడం కష్టమే: చాహల్

image

తన భార్య ధనశ్రీ వర్మతో విడాకుల రూమర్ల నేపథ్యంలో టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు. ‘నిజమైన ప్రేమ చాలా అరుదు.. నా పేరు కూడా అలాంటిదే’ అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్, పాక్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి చాహల్‌ను ఎంపిక చేయలేదు. దీంతో BCCIపై ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.

News January 22, 2025

దావోస్‌లో టీమ్ ఇండియా: సీఎం చంద్రబాబు

image

ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ దావోస్‌లో భేటీ అయ్యారు. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో టీమ్ ఇండియా’ అంటూ ఈ ఫొటోను చంద్రబాబు Xలో పోస్ట్ చేశారు. దేశం, రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలు, సాంకేతికత, ఏఐ, ఉద్యోగాలు వంటి అనేక అంశాలపై వీరు చర్చించినట్లు సమాచారం.

News January 22, 2025

విజయ పరంపర కొనసాగుతుందా?

image

ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. ఈక్రమంలో ఇప్పటికే జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి 4 టీ20 సిరీస్‌లలో ఇండియా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఈ సిరీస్ కూడా గెలుపొంది వరుసగా 5 టీ20 సిరీస్‌లు గెలిచి రికార్డు సృష్టిస్తుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కోహ్లీ కెప్టెన్‌గా మూడు సార్లు గెలిస్తే రోహిత్ సారథ్యంలో ఇండియా ఒకసారి గెలిచింది.