News April 24, 2024
మోదీ మరో పుతిన్: పవార్
ప్రధాని మోదీ మరో పుతిన్‌లా అనిపిస్తున్నారని ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ విమర్శించారు. అందరిలో భయాన్ని పుట్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ‘కొత్త భారతదేశాన్ని నిర్మించేందుకు నెహ్రూ తర్వాత ఇందిర, రాజీవ్, నరసింహారావు, మన్మోహన్ లాంటి ప్రధానులు చేసిన కృషిని చూశాం. ప్రస్తుత పీఎం మాత్రం కేవలం విమర్శలకు పరిమితం. పదేళ్లలో ఏం చేశారో చెప్పరు. ఇతరుల్ని మాత్రం కించపరుస్తారు’ అని విమర్శించారు.
Similar News
News February 5, 2025
విదేశాలకు 47% పెరిగిన పళ్లు, కూరగాయల ఎగుమతులు
APEDA ఆర్థిక సహకారంతో గత ఐదేళ్లలో భారత్ నుంచి పళ్లు, కూరగాయాల ఎగుమతులు 47.3% పెరిగాయని కామర్స్ మినిస్ట్రీ తెలిపింది. విలువ పరంగా ఈ వృద్ధిరేటు 41.5% అని పేర్కొంది. FY 2023-24లో 123 దేశాలకు ఎగుమతులు చేరాయని వెల్లడించింది. రైతుల కోసం Intl ట్రేడ్ ఫెయిర్స్లో పాల్గొనడం, బయ్యర్ సెల్లర్ మీటింగ్స్ ఏర్పాటు, మార్కెట్ యాక్సెస్‌తో ఇది సాధ్యమైందని వివరించింది. గత మూడేళ్లలో 17 కొత్త మార్కెట్లలో ప్రవేశించామంది.
News February 5, 2025
JF కెనడీ భార్యపైనే నెహ్రూకు మరింత ఆసక్తి: Forgotten Crisis బుక్
ఫారిన్ పాలసీపై ఆసక్తి ఉన్న, అర్థం చేసుకోవాలనుకున్న, భవిష్యత్తులో ఏదైనా చేయాలనుకునే వారు JFK’s Forgotten Crisis బుక్ చదవాలని రాహుల్‌ను ఉద్దేశించి మోదీ నిన్న సూచించారు. ఫారిన్ పాలసీ పేరుతో 1962లో ఆడిన ఆట గురించి బాగా తెలుస్తుందంటూ సెటైర్ వేశారు. అప్పట్లో భారత పర్యటనకు వచ్చిన తనతో కాకుండా తన భార్య జాకీ, సోదరి జాక్/బాబీతో మాట్లాడేందుకే నెహ్రూ మరింత ఆసక్తి చూపినట్టు JF కెనడీ పేర్కొన్నట్టు అందులో ఉంది.
News February 5, 2025
ఏపీ నుంచి తెలంగాణ మీదుగా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు
జీవితంలో ఒక్కసారే వచ్చే మహా కుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే మరో 2 ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. మచిలీపట్నం-దానాపూర్ మధ్య ఈ నెల 8, 16 తేదీల్లో ఈ రైళ్లు ఉ.11 గంటలకు బయల్దేరనున్నాయి. అలాగే దానాపూర్-మచిలీపట్నం మధ్య ఈ నెల 10, 18 తేదీల్లో మ.3.15 గంటలకు తిరిగి బయల్దేరనున్నాయి. విజయవాడ, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, మంచిర్యాల నాగ్‌పూర్, మీదుగా ఈ రైళ్లు ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నాయి.