News January 8, 2025
దేశాన్ని మోదీ ఏకతాటిపై నడిపిస్తున్నారు: పవన్ కళ్యాణ్
AP: భారత్ను గొప్ప దేశంగా మార్చేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకతాటిపై దేశాన్ని నడిపిస్తున్నారని ప్రశంసించారు. ఆత్మనిర్భర్, స్వచ్ఛ భారత్ నినాదాలతో ప్రజల మనసును మోదీ గెలుచుకున్నారని చెప్పారు. NDA ప్రభుత్వం గెలవాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారని, ఇవాళ మోదీ రాకతో రాష్ట్రానికి రూ.2.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు.
Similar News
News January 9, 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ X ఫ్యాక్టర్ అవ్వగలడా?
ICC ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ టీమ్ఇండియాకు X ఫ్యాక్టర్గా మారగలడని కొందరు అంచనా వేస్తున్నారు. ODI వరల్డ్కప్ మాదిరిగా ఇక్కడా మిడిలార్డర్లో రాణించగలడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దేశవాళీ క్రికెట్లో అతడు మెరుపులు మెరిపించాడని గుర్తుచేస్తున్నారు. 4 రంజీ మ్యాచుల్లో 90.90 సగటుతో 452, SMATలో 49.28 సగటుతో 345, విజయ్ హజారేలో 5 మ్యాచుల్లోనే 325 రన్స్ చేశాడని అంటున్నారు. మరి మీరేమంటారు?
News January 9, 2025
తొక్కిసలాటపై జుడీషియల్ ఎంక్వైరీ వేస్తున్నాం: సీఎం చంద్రబాబు
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై జుడీషియల్ ఎంక్వైరీ వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ‘ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీల్లేదు. ఘటనపై చాలా బాధపడుతున్నాం. ఇటు టీటీడీ ఛైర్మన్, అటు ఈఓ, మేనేజ్మెంట్, అధికారులు ఇంకా సమన్వయంతో పనిచేయాలి. దేవుని పవిత్రత దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ మనస్సాక్షి ప్రకారం సేవకులుగా పనిచేయండి’ అని సూచించారు.
News January 9, 2025
వైకుంఠ ద్వార దర్శనం 10రోజులెందుకు?: సీఎం చంద్రబాబు
AP: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాన్ని 10రోజుల పాటు జరపడాన్ని సీఎం చంద్రబాబు వ్యతిరేకించారు. ‘వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అనేవి పవిత్రమే కానీ దాన్ని పది రోజులెందుకు చేశారో నాకు తెలియడం లేదు. స్వామివారు ఇక్కడ వెలువడినప్పటి నుంచీ పాటించే సంప్రదాయాల్ని మార్చకుండా అనుసరించాలనేది నా అభిప్రాయం. ఆ విషయంలో ఆగమ పండితులు తుది నిర్ణయం తీసుకుంటారు’ అని పేర్కొన్నారు.