News August 15, 2024
మోదీ జీ.. మెడల్స్ తెచ్చిన పిస్టల్ ఇదే

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత ఆటగాళ్లతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ క్రమంలో మనూ భాకర్ తనకు పతకాలు తీసుకొచ్చిన పిస్టల్‌ను ప్రధానికి చూపించారు. పారిస్ వెళ్లిన ప్రతి ప్లేయర్ ఛాంపియన్ అని ప్రధాని మోదీ కొనియాడారు. భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ క్రీడలను ప్రొత్సహిస్తుందని, అత్యున్నతమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
Similar News
News November 2, 2025
ధ్వజస్తంభాన్ని ఎలా తయారుచేస్తారు?

ధ్వజస్తంభాన్ని పలాస, రావి, మారేడు వంటి పవిత్ర వృక్షాల కలపతో తయారుచేసి, ఇత్తడి లేదా బంగారు తొడుగు వేస్తారు. దీని కింద వైష్ణవాలయాల్లో సుదర్శన చక్రం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నాలు ఉంటాయి. దీనికి జీవధ్వజం అనే పేరు కూడా ఉంది. గోపుర కలశం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమమని శాస్త్రాలు చెబుతున్నాయి. ధ్వజస్తంభం పవిత్రత, శక్తిని కలిగి ఉండటానికి నిత్య అనుష్ఠానాల వల్ల భగవంతుని చూపు దీనిపై పడుతుంది.
News November 2, 2025
నేడు బిహార్‌లో ప్రధాని మోదీ ప్రచారం

నేడు ప్రధాని మోదీ బిహార్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భోజ్‌పుర్ జిల్లా అర్రాలో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. మ.3.30 గంటలకు నవాడాలో ప్రచార సభకు హాజరవుతారు. పట్నాలో సాయంత్రం 5.30 గంటలకు రోడ్‌షో నిర్వహిస్తారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పలు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
News November 2, 2025
ఉగ్రవాదులను తుడిచిపెట్టేస్తాం: ట్రంప్

నైజీరియాలో క్రైస్తవుల హత్యలు ఆగకపోతే అన్ని సహాయ సహకారాలు ఆపేస్తామని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఆ దేశంలోకి చొచ్చుకెళ్లి ఇస్లామిక్ ఉగ్రవాదులను పూర్తిగా నాశనం చేయొచ్చు. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని మా యుద్ధ విభాగాన్ని ఆదేశిస్తున్నా. క్రైస్తవులపై ఉగ్రవాదులు దాడి చేసినట్లుగానే మా దాడి వేగంగా, దారుణంగా, మధురంగా ఉంటుంది. నైజీరియా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలి’ అని హెచ్చరించారు.


