News February 14, 2025

భారత్‌కు బయల్దేరిన మోదీ

image

ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన ముగిసింది. దీంతో ఆయన భారత్‌కు తిరుగు పయనమయ్యారు. ఈనెల 10న ఫ్రాన్స్ వెళ్లిన ఆయన రెండు రోజులు అక్కడ పర్యటించారు. ఆ దేశ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో భేటీ అయ్యారు. అనంతరం మోదీ అమెరికా వెళ్లారు. 12, 13 తేదీల్లో పర్యటించి అధ్యక్షుడు ట్రంప్ సహా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, తులసీ గబ్బార్డ్, ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి తదితరులతో సమావేశమయ్యారు.

Similar News

News November 20, 2025

అదును తప్పిన పైరు.. ముదిమిలో బిడ్డలు ఒక్కటే

image

ఏ పంటకైనా అదును(అనుకూల సమయం) ముఖ్యం. సరైన సమయానికి విత్తనం వేయకపోతే పంట సరిగా రాదు, దాని వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ముసలి వయసులో పిల్లలు పుడితే, వారు తల్లిదండ్రులకు అండగా నిలబడలేరు లేదా వారికి సేవ చేయలేరు. ఈ రెండూ సమయానికి చేయని పనులు లేదా నిష్ప్రయోజనమైన పరిస్థితులను తెలియజేస్తాయి.

News November 20, 2025

హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

image

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా బుధవారం రాత్రి వరకు హిడ్మా, అతని భార్య రాజేతోపాటు మరో మావోయిస్టు మృతదేహానికి మాత్రమే రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. మరో ముగ్గురి మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారు.

News November 20, 2025

శబరిమల భక్తులకు అలర్ట్!

image

భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బుకింగ్స్‌ను 20 వేల నుంచి 5 వేలకు తగ్గించింది. వర్చువల్ క్యూ ద్వారా మరో 70 వేల మందిని అనుమతించనుంది. ఈ మేరకు రోజుకు 75 వేల మందికి దర్శనం కల్పించనుంది. అడవి మార్గంలో వచ్చే భక్తులకు పాసులు తప్పనిసరి అని స్పష్టం చేసింది. రద్దీని తగ్గించేందుకు నీలక్కల్ దగ్గర కొత్తగా 7 బుకింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది.