News September 24, 2024
అమెరికా నుంచి భారత్‌కు బయల్దేరిన మోదీ

PM మోదీ 3 రోజుల అమెరికా పర్యటన ముగిసింది. కెనడీ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో ఆయన భారత్‌కు బయల్దేరారు. ఈ పర్యటనలో ఆయన బిజీగా గడిపారు. క్వాడ్ సమ్మిట్‌లో US, జపాన్, ఆసీస్ అధినేతలతో చర్చించారు. ఓ సభలో భారతీయులతో మాట్లాడారు. టెక్ కంపెనీల CEOలను కలిసి కీలక రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించారు. యుద్ధ సంక్షుభిత పాలస్తీనా, ఉక్రెయిన్ నేతలతో మాట్లాడారు. ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లారు.
Similar News
News November 20, 2025
పోలి పాడ్యమి ఎప్పుడు జరుపుకోవాలంటే..?

పోలి పాడ్యమిని నవంబర్ 21వ తేదీన(శుక్రవారం) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ‘పాడ్యమి తిథి నవంబర్ 20 ఉదయం 10:30కి ప్రారంభమై, నవంబర్ 21 మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. సూర్యోదయాన్ని పరిగణనలోకి తీసుకొని నవంబర్ 21నే పోలి పాడ్యమి నిర్వహించాలి. ఇక నవంబర్ 22, 2025 శనివారం తెల్లవారుజామున 4:35 నుంచి 6:00 గంటల వరకు దీపాలను నీటిలో వదలడానికి అనుకూల సమయం’ అని చెబుతున్నారు.
News November 20, 2025
ఫోన్‌పే టాప్!

మన దేశంలో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్‌పే ఆధిపత్యం కొనసాగుతోంది. 45.47% మార్కెట్ షేర్‌తో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత గూగుల్ పే (34.62%), పేటీఎం (7.36%), Navi (2.78%), సూపర్ మనీ (1.28%) ఉన్నాయి. ఫోన్‌పే, గూగుల్ పే కలిపి 80 శాతానికి పైగా మార్కెట్ షేర్‌ను కలిగి ఉండటం విశేషం. BHIM, CRED లాంటి ప్లాట్‌ఫామ్స్ కూడా వినియోగిస్తున్నారు. మరి మీరు ఏది వాడుతున్నారో కామెంట్ చేయండి.
News November 20, 2025
తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ముర్ము పర్యటన

ఏపీ, తెలంగాణలో పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొననున్నారు. 22న పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరగనున్న సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ఆమె హాజరవుతారని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. తొలుత 21న హైదరాబాద్‌లో ‘భారతీయ కళామహోత్సవ్- 2025’ను రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. అనంతరం శనివారం పుట్టపర్తికి వెళ్లనున్నారు.


