News April 5, 2025
1996 WC విన్నింగ్ క్రికెటర్లతో మోదీ భేటీ

శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడి లెజెండరీ క్రికెటర్లతో సమావేశమయ్యారు. 1996 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యులైన జయసూర్య, అరవింద డిసిల్వా సహా పలువురు ప్లేయర్లతో ముచ్చటించారు. అలాగే 1987-90 మధ్య శ్రీలంక శాంతి, సమగ్రత కోసం ప్రాణాలను అర్పించిన ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్(IPKF) స్మారకం(కొలంబో) వద్ద నివాళులర్పించారు. ఆ సైనికులను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని ట్వీట్ చేశారు.
Similar News
News April 6, 2025
పిఠాపురంలో టీడీపీ నేతలపై కేసు

AP: పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు <<15990895>>పర్యటన సందర్భంగా <<>>జనసేన, టీడీపీ వర్గీయుల మధ్య బలప్రదర్శన వాగ్వాదానికి దారి తీసింది. తనను దూషించారని జనసేన నేత ఫిర్యాదుతో చినజగ్గంపేటకు చెందిన TDP నేతలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
News April 6, 2025
లోకేశ్ సొంత ఇలాకాలో ‘గంజాయి’: YCP

AP: మంత్రి లోకేశ్ సొంత ఇలాకా మంగళగిరిలో గంజాయి పట్టుబడిందని YCP ట్వీట్ చేసింది. ‘కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా గంజాయిని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 1.2kgs గంజాయి, 8.71gms డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. ఒక్క చోట పట్టుకున్న గంజాయే ఇంత ఉంటే రాష్ట్రంలో ఎంత ఉందో? 100 రోజుల్లో గంజాయి లేకుండా చేస్తానని లోకేశ్ బీరాలు పలికారు. మరి అధికారంలోకి వచ్చి 100 రోజులు కాలేదా’ అని విమర్శించింది.
News April 6, 2025
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి కన్నుమూత

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి కిమ్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. గుండెపోటుకు గురై గత కొన్ని రోజులుగా ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ తుది శ్వాస విడిచారు. కిమ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమెను జాక్వెలిన్ దగ్గరుండి చూసుకున్నారు. ఇటీవల ఐపీఎల్ ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సి ఉన్నా తల్లి కోసం రద్దు చేసుకున్నారు. కిమ్ ఫెర్నాండెజ్‌కు మొత్తం నలుగురు సంతానం.