News November 19, 2024

బ్రెజిల్, చిలీ అధ్యక్షులతో మోదీ భేటీ

image

G20 సమ్మిట్‌లో బ్రెజిల్, చిలీ దేశాధ్యక్షులు లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా, గాబ్రియల్ బోరిక్‌లతో PM మోదీ సమావేశమయ్యారు. బ్రెజిల్‌తో విద్యుత్, జీవ ఇంధనం, రక్షణ, వ్యవసాయ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్ కృతనిశ్చయంతో ఉందని మోదీ చెప్పారు. ఫార్మాస్యూటికల్స్, టెక్నాలజీ, స్పేస్ తదితర రంగాల్లో చిలీతో సంబంధాలు బలపడుతున్నాయని తెలిపారు. చిలీలో ఆయుర్వేదానికి ప్రాధాన్యత పెరగడం ఆనందంగా ఉందన్నారు.

Similar News

News November 11, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 11, 2025

ఢిల్లీ పేలుడు.. కారు యజమాని ఎవరంటే?

image

ఢిల్లీలో ఎర్రకోట వద్ద పేలుడు i20 <<18253113>>కారు<<>>లో జరిగిందని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. కారు రిజిస్ట్రేషన్ నం. HR26 CE7674 కాగా హరియాణాలోని గురుగ్రామ్‌లో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. యజమాని మహ్మద్ సల్మాన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. పుల్వామాకు చెందిన తారిక్ అనే వ్యక్తికి ఈ కారును అమ్మానని సల్మాన్ పోలీసులకు చెప్పాడని NDTV తెలిపింది. అయితే తారిక్ మరో వ్యక్తికి కారును అమ్మారా అనే విషయం తెలియాలి.

News November 11, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 11, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.04 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.19 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.