News August 22, 2024
మోదీ వాట్సాప్ యూనివర్సిటీ పెట్టారు: రేవంత్

TG: నరేంద్ర మోదీ వాట్సాప్ యూనివర్సిటీ పెట్టి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ <<13915338>>ఆరోపించారు<<>>. BJPకి 400 పార్లమెంటు సీట్లు వస్తాయని మోదీ అన్నారని, కానీ 240 సీట్లకు మించవని తాను ఆరోజే చెప్పానని రేవంత్ గుర్తు చేశారు. తాను చెప్పినట్లే BJPకి సీట్లు వచ్చాయని అన్నారు. BRSకి పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు రాదని చెప్పానని, అలాగే జరిగిందని రేవంత్ అన్నారు.
Similar News
News November 19, 2025
నేటి సామెత.. ‘అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు’

సమయం చూసి వ్యవసాయం చేయాలి. అంటే, వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించి సాగును ప్రారంభించాలి. భూమికి, వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పంటను వెయ్యాలి. సమయం దాటితే పంట చేతికి రాదు, శ్రమ కూడా వృథా అవుతుంది. అలాగే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా అంచనా వేసి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం.
News November 19, 2025
త్వరలో ఆధార్ కార్డులో కీలక మార్పులు!

ఆధార్ విషయంలో కీలక మార్పులు చేయాలని UIDAI భావిస్తోంది. ఫొటో, QR కోడ్తో ఆధార్ కార్డును తీసుకురావడాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వ్యక్తుల డేటా దుర్వినియోగం కాకుండా ఈ దిశగా ఆలోచిస్తోందని తెలిపాయి. కార్డుపై వివరాలు ఎందుకు ఉండాలని, ఫొటో, QR కోడ్ ఉండాలని UIDAI CEO భువనేశ్ కుమార్ అన్నారు. ఆఫ్లైన్ వెరిఫికేషన్ను నియంత్రించేలా డిసెంబర్లో కొత్త రూల్ తీసుకొస్తామని తెలిపారు.
News November 19, 2025
ఇలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి ఉండదట

మాసిన బట్టలు ధరించి, పరిశుభ్రత పాటించనివారి దగ్గర లక్ష్మీదేవి ఉండదని పండితులు చెబుతున్నారు. అలాగే అమితంగా తినేవారి దగ్గర, బద్ధకంగా ఉండే వ్యక్తులు దగ్గర, కర్ణ కఠోరంగా మాట్లాడేవారి దగ్గర ధనం నిలవదని అంటున్నారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పడుకునేవారు ఎంతటి గొప్పవారైనా వారిని లక్ష్మీదేవి అనుగ్రహించదని తెలుపుతున్నారు. ఒకవేళ వీరి వద్ద సంపద ఉన్నా, అది ఎక్కువ రోజులు నిలవదని పేర్కొంటున్నారు.


